‘RC15’లో సీనియర్ హీరో.. ఆ స్టార్ నటుడు ఎవరంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇప్పుడు పాన్ వరల్డ్ గా పేరు తెచ్చుకున్నాడు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న చరణ్ ఆ తర్వాత గ్లోబల్ వైడ్ గా స్టార్ డమ్ ను అందుకుంటున్నాడు.

ఈ సినిమా తర్వాత మరో అగ్ర డైరెక్టర్ ను చరణ్ లైన్లో పెట్టుకున్నాడు.

ఇండియన్ కామెరూన్ శంకర్ దర్శకత్వంలో చరణ్ ఆర్సీ15 సినిమా చేస్తున్నాడు.శంకర్, రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా షూట్ ఇప్పటికే చివరకు చేరుకుంది.80 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు.

దిల్ రాజు తన కెరీర్ లోనే మొదటి సారి ఈ స్థాయిలో బడ్జెట్ పెట్టడంతో ఈ సినిమాపై సహజంగానే అంచనాలు పెరిగాయి.

"""/"/ ఇక ఈ సినిమా మొదలైనప్పటి నుండి ఏదొక వార్త వస్తూనే ఉంది.

తాజాగా మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో మరో సీనియర్ హీరో నటిస్తున్నాడు అంటూ తాజాగా టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమా పీరియాడిక్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో విప్లవ నాయకుడి పాత్ర ఒకటి ఉందట.

ఆ పాత్ర చరణ్ పాత్రకు గురువు పాత్ర అని టాక్. """/"/ మరి ఈ పాత్ర కోసం కన్నడ హీరో ఉపేంద్రను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ పాత్ర సినిమాలో సెకండాఫ్ లో వస్తుంది అని స్పెషల్ రోల్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందట.

మరి మేకర్స్ చెప్పిన ఈ పాత్రలో నటించడానికి ఉపేంద్ర అంగీకరిస్తాడో లేదో వేచి చూడాలి.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.

థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ అయితే రాలేదు.

మెజారిటీ కోసమే ఈ ఎన్నికలు అంటూ చింతమనేని సంచలన వ్యాఖ్యలు..!!