చరణ్ తో కొత్తగా ట్రై చేస్తున్న శంకర్.. చెర్రీ రోల్ పై లేటెస్ట్ అప్డేట్!

మెగాస్టార్ వారసుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కొద్దీ కాలంలోనే తనని తాను నిరూపించుకుని స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్ తేజ్.

ఇక ఈ మధ్యనే అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్ నటించాడు.

ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్ గా సక్సెస్ అయ్యాడు.

ప్రెజెంట్ అయితే చరణ్ లైనప్ ఇంట్రెస్టింట్ దర్శకులతో సాగుతుంది.ఈయన లైనప్ లో ఉన్న ఫస్ట్ డైరెక్టర్ ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్.

శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందనే విషయం తెలిసిందే.

"""/"/ ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది.ఇటీవలే న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి చేసిన టీమ్ కొద్దీ గ్యాప్ తోనే మరో షెడ్యూల్ స్టార్ట్ చేసారు.

ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ లేని సన్నివేశాలు తెరకెక్కించ బోతున్నారు.రామ్ చరణ్ కూడా ఈ షూట్ లో పాల్గొన్నారు అని తెలుస్తుంది.

ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ రోల్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో చరణ్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉన్న విషయం తెలిసిందే.

ఈ ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడు అని తెలుస్తుంది.

ఒక పార్టీ తన పాత్రపై ఉంటుంది అని ఇప్పుడు ఆ సభ తాలూకూ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇలా శంకర్ చరణ్ తో కొత్తగా ట్రై చేస్తున్నట్టే అనిపిస్తుంది.మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాల్సిందే.

ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకోగా.

దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది.

Happy Luke Bonuses: A Practical Breakdown For UK Players