Sr NTR Bhanumathi: సీనియర్ ఎన్టీఆర్ నే బురిడీ కొట్టించిన స్టార్ హీరోయిన్….ఏం చేసిందంటే?

తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరు గౌరవించే వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు.

( Sr NTR ) ఆ రోజుల్లో ఆయన్ను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి కూడా హడలిపోయేవారట అందరు.

ఆయనతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడేవారట.అటువంటి రామారావు గారిని తన చమత్కారంతో బురిడీ కొట్టించారు ఒక హీరోయిన్.

ఆమె ఎవరు? అసలు ఆవిడకు రామారావు గారికి మధ్య ఏం జరిగింది? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందా.

భానుమతి ( Bhanumathi ) గారి పేరు అందరు వైన్ ఉంటారు.ఈమె తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి లేడీ సూపర్ స్టార్.

1930 లలో మొదలుకొని 1990 ల వరకు సుమారు 70 ఏళ్ళ తన సినీ ప్రయాణంలో ఆవిడ అనేక స్టేర్ హీరోలతో నటించింది.

టాలీవుడ్ లో మొదటి లేడీ డైరెక్టర్ కూడా ఈమె.భానుమతి గారు 1953 లో చండీరాణి( Chandirani Movie ) అనే సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషలలో తెరకెక్కించారు.

కేవలం నటన, దర్శకత్వం మాత్రమే కాదండి ఈమె ఒక మంచి సింగర్ కూడా.

ఈమె తెలుగు, తమిళ, హిందీ భాషలలో అనేక పాటలు పాడారు.అసలు విషయానికి వస్తే.

"""/" / రామారావు గారు 1974 లో "తాతమ్మ కల"( Tatamma Kala ) అనే చిత్రాన్ని తెరకెక్కించారు.

ఆ చిత్రంలో ఆయనే హీరో.ఆ సినిమాలో తాతమ్మ పాత్రకు భానుమతి గారిని తీసుకుందాం అనుకుని ఆ సినిమా రచయిత డి.

వీ.నరసింహ రాజు గారిని భానుమతి గారిని రెమ్యూనిరేషన్ ఎంతో కనుక్కొని రమ్మని పంపారట రామారావు గారు.

దానికి ఆమె నరసింహ రాజు( Narasimha Raju ) గారితో రామారావు గారు ఎంత తీసుకుంటే దానికి ఒక ఐదు వేలు తగ్గించి ఇమ్మని అడిగారట.

"""/" / అప్పట్లో రామారావు గారు ఒక సినిమాకు నాలుగు నుంచి ఐదు లక్షలు తీసుకునేవారట.

కానీ ఆయన తన రెమ్యూనరేషన్ రెండు లక్షలు అని చెప్పి 1,95,000 వేల రూపాయలు పంపించారట.

వెంటనే ఆమె ఆ డబ్బు తీసుకోకుండా వాటికి మరో ఐదు వేలు జోడించి తాను తరువాత డైరెక్ట్ చెయ్యబోయే చిత్రంలో రామారావు గారు హీరోగా నటించాలి అని అడిగిందట.

ఇది చూసి రామారావు గారి మతి పోయిండట.కానీ ఇచ్చిన మాట ప్రకారం భానుమతి గారు దర్శకత్వం వహించిన "అమ్మాయి పెళ్లి" ( Ammayi Pelli Movie ) చిత్రంలో నటించారు రామారావు గారు.

నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. అస్త్రాలు రెడీనా ?