ఆ స్టార్ హీరోయిన్‌ను హైదరాబాద్ అంతా కారులో తిప్పిన ప్రొడ్యూసర్.. ఎందుకో తెలిస్తే..

రొమాంటిక్ థ్రిల్లర్ ఫిలిం "ఆత్మబలం (1964)"( Aathma Balam ) ఎంత పెద్ద హిట్ అయిందో మునుపటి జనరేషన్ ప్రజలకు తెలిసే ఉంటుంది.

ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, బి.సరోజాదేవి హీరో హీరోయిన్లుగా నటించారు.

V.మధుసూధనరావు దీన్ని డైరెక్ట్ చేశారు.

V.B.

రాజేంద్ర ప్రసాద్ నిర్మించారు.కె.

వి.మహదేవన్ కంపోజ్ చేసిన ఇందులోని చిటపట చినుకులు, ఎక్కడికి పోతావు చిన్నవాడా, పరుగు తీసే పాటలు వంటి బాగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ నగరంలోని సారథి స్టూడియోలో జరిగింది.అయితే ఆ రోజుల్లో మహానగరాల్లోనూ పవర్ కట్స్ ఎక్కువగా ఉండేవి.

జనరేటర్లు కూడా అప్పటికింకా అందుబాటులోకి రాలేదు.కరెంటు పోయిందంటే మళ్ళీ రావడానికి కనీసం మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టేది.

"ఆత్మబలం" సినిమా చేసే నాటికే సరోజా దేవి( Saroja Devi ) స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

తెలుగుతో పాటు తమిళంలో సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడిపేది.అయితే షూటింగ్ సమయంలో కరెంటు పోతే తాను వెళ్ళిపోతానని సరోజా దేవి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లను బెదిరించేది.

"""/" / అందువల్ల "ఆత్మబలం" షూటింగ్ జరిగేటప్పుడు నిర్మాత రాజేంద్రప్రసాద్( Producer Rajendra Prasad ) చాలా భయపడ్డారు.

అలా తిరిగి వెళ్ళిపోకుండా ఉండాలని ఒక ప్లాన్ వేశారు.అదేంటంటే కరెంటు పోయినప్పుడల్లా సరోజా దేవిని తన కారులో ఎక్కించుకొని హైదరాబాద్( Hyderabad ) అంతా తిప్పేవారు.

చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా మందిర్ వంటి టూరిస్ట్ అట్రాక్షన్స్‌ చూపించేవారు.ఈ సినిమా షూటింగ్ అయిపోయే వరకు ఆయన అలాగే ఆమెను కారులో తిప్పక తప్పలేదు.

ఆ తర్వాత ఈ సంగతి తెలుసుకుని చాలామంది నవ్వుకున్నారు.ఇప్పటి హీరోయిన్లకు అలాంటి సాకులు ఎదురయ్యే అవకాశం ఉండదు.

నిర్మాతలకు కూడా కార్లలో తిప్పే బాధ లేకుండా పోయింది.కానీ పారితోషికం విషయంలోనే నిర్మాతలను కొంతమంది హీరోయిన్లు ఇబ్బంది పెడుతుంటారు.

"""/" / ఇకపోతే సరోజా దేవి కన్నడ సినిమాలో మొదటి మహిళా సూపర్ స్టార్‌గా నిలిచింది.

17 ఏళ్ల వయస్సులోనే కన్నడ చిత్రం మహాకవి కాళిదాస (1955)తో పెద్ద హిట్ అందుకుంది.

సరోజ 1967లో ఇంజనీర్ అయిన శ్రీ హర్షను వివాహం చేసుకుంది.శ్రీ హర్ష 1986లో చనిపోయాడు.

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.సరోజా దేవిని పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులతో సత్కరించారు.

భూకైలాస్, పెళ్లి సందడి, పెళ్లి కానుక, జగదేకవీరుని కథ, శ్రీకృష్ణార్జునయుద్ధం లాంటి తెలుగు హిట్ సినిమాలు ఆమె నటించి ఎంతగానో మెప్పించారు.