ఈయన్ని సరిగ్గా వాడుకుంటే పరేష్ రావల్ కన్నా మంచి నటుడు అవుతాడు గురూజీ

చాల మంది డాక్టర్ కావలి అనుకోని యాక్టర్ అయ్యామని చెప్తూ ఉంటారు.కానీ డాక్టర్ అయ్యాక కూడా ఎంతో మంది నటన మీద ఉన్న ఫ్యాషన్ తో ఇండస్ట్రీ తో పాపులర్ నటులుగా స్థిరపడ్డారు.

నాటి రోజుల్లో అల్లు రామలింగయ్య, ప్రభాకర్ లాంటి వాళ్ళ నుంచి నేటి రోజుల్లో రాజశేఖర్, సాయి పల్లవి వరకు డాక్టర్స్ నుంచి యాక్టర్స్ గా మారినవారిని మనం చూడవచ్చు.

అయితే ఇదే కోవలోకి వచ్చే మరొక డాక్టర్ కం యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్.

తెలుగులోకి చాల లేటు గా ఎంట్రీ ఇచ్చిన మంచో నోటబుల్ సినిమాల్లోనే నటిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు.

చాల బాగా నటిస్తారు.ఆయన్ని చూస్తే బాలీవుడ్ యాక్టర్ పరేష్ రావల్ నటన గుర్తస్తుంది.

మొదటగా అయన 2013 లో చమ్మక్ చలో అనే సినిమాతో నటించడం మొదలు పెట్టారు.

ఈ తోమిదేళ్లలో 30 కి పైగా సినిమాల్లో నటించారు.  ఈ ఏడాది ఏకంగా మరొక 12 సినిమాలతో మన ముందుకు రాగా మరికొన్ని సినిమాలు విడుదల కు సిద్ధంగా ఉన్నాయ్.

కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ సినిమాల్లో కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాడు.ఓటిటి లో కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా కనిపించాడు.

  కేవలం నటుడిగా ఆగిపోతే ఆయన్ని మనం ఎందుకు గుర్తు చేసుకుంటాం.2013 లో ఇండస్ట్రీ కి వస్తూనే ఏప్రిల్ ఫూల్ అనే సినిమా తీసి విడుదల చేసాడు.

"""/"/ ఆ తర్వాత దర్శకత్వం జోలికి పోకుండా సినిమాల్లో నటుడిగానే బిజీ గా ఉన్నాడు.

అయితే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ అండర్ రేటింగ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న శ్రీకాంత్ కి ఒక మంచి అవకాశం కనుక వస్తే పరేష్ రావల్ ని మించి పోయే నటుడు అవుతాడు అనుకోవడం లో ఎటువంటి సందేహం లేదు.

అయన నటించిన వీరప్పన్, డియర్ కామ్రేడ్, మెహబూబా, కరోనా వైరస్, దిశా ఎన్కౌంటర్, మర్డర్, అమరం అఖిలం ప్రేమ వంటి వాటిల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

  బ్రోచేవారెవరురా అనే సినిమా మాత్రం శ్రీకాంత్ అయ్యంగార్ ని మాత్రం నటుడిగా మరో మెట్టు ఎక్కించింది.

అయినా ఇంకా ఎందుకో ఎదో అసంతృప్తి.ఇంకా మంచి పాత్రలు, మంచి సినిమాలు వస్తే అయన ఎక్కడో అతడు.

భవిష్యత్తులో ఖచ్చితంగా గొప్ప నటుడిగా ఎదిగే అవకాశం ఉంది.

Jansena Pawan Kalyan : అంతా ఆయనే చేస్తున్నాడా ? జనసైనికుల గుర్రు