ఆర్ఆర్ఆర్‌లో ఆ ఘట్టం కోసం కొట్టుకోనున్న ఫ్యాన్స్

ఆర్ఆర్ఆర్‌లో ఆ ఘట్టం కోసం కొట్టుకోనున్న ఫ్యాన్స్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆర్ఆర్ఆర్‌లో ఆ ఘట్టం కోసం కొట్టుకోనున్న ఫ్యాన్స్

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆర్ఆర్ఆర్‌లో ఆ ఘట్టం కోసం కొట్టుకోనున్న ఫ్యాన్స్

కాగా ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు.

అయితే పూర్తిగా సోషియో ఫాంటసీ కథతో ఈ సినిమాను జక్కన్న రెడీ చేస్తున్నట్లు పలుమార్లు తెలిపాడు.

నిజానికి స్వాతంత్ర్య సమరయోధులైన అల్లూరి సీతారామరాజు, కొమురం భీం విభిన్న ప్రాంతాలకు చెందిన వారు.

వాస్తవిక జీవితంలో వారిద్దరు కలుసుకున్న దాఖలాలు లేవు.కానీ ఆర్ఆర్ఆర్ చిత్రంలో వారిద్దరినీ కలిపి మనకు చూపించనున్నాడు జక్కన్న.

దీంతో వారిద్దరు ఎలాంటి సందర్భంలో ఎక్కడ కలుసుకుంటారనే అంశం ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య నిర్మిస్తుండగా, ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మారిస్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

మరి ఈ సినిమాను జక్కన్న ప్రేక్షకులకు ఏ విధంగా చూపించనున్నాడో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

లోకేష్ కనకరాజ్ ఇద్దరు స్టార్ హీరోలను లైన్ లో పెట్టాడా..?

లోకేష్ కనకరాజ్ ఇద్దరు స్టార్ హీరోలను లైన్ లో పెట్టాడా..?