'ఖుషి'లో సమంత పాత్ర రివీల్.. ఈమె రోల్ సినిమాకే హైలెట్ అట!
TeluguStop.com
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.విడాకుల తర్వాత పడి లేచిన కెరటంగా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూసుకు పోతుంది.
ఈమె ప్రెసెంట్ నటించిన శాకుంతలం, యశోద సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.
ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో కూడా ఈమె సినీ అవకాశాల కోసం ట్రై చేస్తుంది.
అలాగే విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత కూడా పూరీ దర్శకత్వంలోనే జనగణమన సినిమా ప్రకటించాడు.
ఈ సినిమా ప్రకటించి ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా ప్రకటించాడు.
ఈ రెండు సినిమాల్లో ముందుగా శివ సినిమాను స్టార్ట్ చేసి షూటింగ్ కూడా వేగంగా పూర్తి చేస్తున్నాడు.
ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.మొదటిసారి కొత్త జోడీ కావడంతో తెరపై ఫ్రెష్ ఫీలింగ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా కాశ్మీర్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ అని తెలుస్తుంది.
ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.కాశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ ను ఫినిష్ చేసారు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/07/Interesting-rumor-on-Vijay-D-–-Samantha-project-detailsa!--jpg "/ ఇక ఆ తర్వాత వైజాగ్ లో మరొక షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు.
ఇక తాజాగా ఈ సినిమాలో సమంత పాత్ర ఎలా ఉండబోతుంది అని టాక్ బయటకు వచ్చింది.
సమంత క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా కొత్తగా ఉండబోతుంది అని.ఇంటర్వెల్ లో సామ్ పాత్ర ద్వారా రివీల్ అయ్యే ట్విస్ట్ సినిమా మొత్తానికే హైలెట్ కానుందని టాక్ వినిపిస్తుంది.
అంతేకాదు ఈ సినిమా లవ్ స్టోరీ చాలా మెచ్యూర్ గా ఉండబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి.
ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హీషమ్ సంగీతం అందిస్తున్నారు.
మరి ఈ లవ్ స్టోరీ ఈ జోడీకి ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాల్సిందే.
హెయిర్ డ్యామేజ్ కు కారణాలేంటి.. ఈ సమస్యను ఎలా వదిలించుకోవాలి?