శివుని కంఠం నీలి రంగులో ఎందుకు ఉంటుందో తెలుసా?

శివుడు.హిందూ పురాణాలలో అత్యంత శక్తివంతమైన దేవుడిగా శివుడుని భావిస్తారు.

మనం పుట్టినప్పటి నుంచి శివుడి కథలు వింటూ ఉంటాం.గొప్ప శక్తులు కలిగినటువంటి పరమశివుడి కంఠం ఎందుకు నీలి రంగులో ఉంటుందో తెలుసా? దాని వెనుక అసలు అర్ధం ఏంటో మీకు తెలుసా?.

పురాణాల ప్రకారం దేవతలకు అసురులే శత్రువులు.అయితే ఒకానొక సమయంలో రాక్షసులతో కలిసి క్షీరసాగర మథనం చేస్తారు.

సముద్రం దిగువ నుండి వచ్చే అమృతాన్ని పొందడానికి, దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మథనాన్ని చిలుకుతారు.

అయితే సముద్రంలో నుంచి మొదట కామధేనువు వస్తుంది.దానిని వశిష్ఠ దేవుడు తీసుకుంటారు.

తరువాత కల్పవృక్షం వస్తే, దానిని దేవేంద్రుడికి ఇచ్చారు.ఇలా సాగర మథనం చేస్తూ ఉండగా.

విషం బయటకు వస్తుంది.దానిని దేవతలు మరియు రాక్షసులు తీసుకోవడానికి ఎవరూ ముందుకురారు.

దేవతలు, రాక్షసులు ఇద్దరూ కలిసి వెళ్లి ఆ పరమేశ్వరుడిని వేడుకుంటారు.అయితే తనను నమ్మిన వారికి సహాయం చేయాలని పరమేశ్వరుడు ఆ విషాన్ని తాగుతాడు.

అయితే ఆ విషాన్ని శివుడు మింగకుండా అలాగే తన కంఠంలోనే ఉంచుకుంటాడు.అలా తన కంఠంలో విషం ఉండడం వల్ల తన గొంతు నీలంగా మారుతుంది.

అందుకే పరమేశ్వరుడిని నీలకంఠేశ్వరునిగా పిలుస్తారు.

నా స్ట్రెచ్ మార్క్స్ చూపించమని ఆ డైరెక్టర్ అడిగారు : ఆమని