పెళ్లి చూపులలో అలాంటి ప్రశ్న వేసిన ఉపాసన..చరణ్ సమాధానంతో ఫిదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంది సక్సెస్ అందుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అయ్యారు.

వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న రామ్ చరణ్ అపోలో హాస్పిటల్ డైరెక్టర్ ఉపాసన(Upasana) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసినదే.

వీరి వివాహం జరిగి సుమారు 12 సంవత్సరాలు అవుతుంది.ఇలా 12 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.

ఉపాసన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఈమెకు కూడా భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారని చెప్పాలి.

"""/" / రామ్ చరణ్ ఉపాసన(Ram Charan, Upasana) ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి అయిన 11 సంవత్సరాలకి ఈ జంట కుమార్తెకు జన్మనిచ్చారు.ఇదిలా ఉండగా తాజాగా ఉపాసన రాంచరణ్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పెళ్లి చూపుల సమయంలో రామ్ చరణ్ ని ఉద్దేశించి ఉపాసన ఓ ప్రశ్న అడిగారట అయితే ఆ ప్రశ్నకు చరణ్ చెప్పిన సమాధానం విని అక్కడున్న వారందరూ ఫిదా అయ్యారని తెలుస్తోంది.

మరి రామ్ చరణ్ ను ఉపాసన అడిగిన ప్రశ్న ఏంటి అనే విషయానికి వస్తే.

"""/" / పెళ్లి చూపుల (Wedding Looks)సమయంలో ఉపాసన రామ్  చరణ్ ను ప్రశ్నిస్తూ పెళ్లి తర్వాత మీరు నాకు ఇంపార్టెన్స్ ఇస్తారా లేకపోతే మీ అమ్మగారికి ప్రాధాన్యత ఇస్తారా అని ప్రశ్నించారట.

ఇలాంటి ప్రశ్న ఉపాసన అడగడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా చరణ్(Charan) సమాధానం విని ముక్కున వేలు వేసుకున్నారు.

అమ్మను ప్రేమించే ప్రతి మగాడు తన భార్యను కూడా అదే విధంగా ప్రేమిస్తాడని ఇద్దరినీ సమానంగా చూసుకుంటారని చరణ్ సమాధానం చెప్పడంతో అందరూ ఒక్కసారిగా చరణ్ మాటలకు ఫిదా అవడమే కాకుండా గట్టిగా చప్పట్లు కొట్టారని తెలుస్తుంది.

ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అది మా చరణ్ అన్న అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

క్యారెట్ తో ఆరోగ్యమే కాదు జుట్టును కూడా పెంచుకోవ‌చ్చు.. ఇంతకీ ఎలా వాడాలంటే?