Sreeleela : సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శ్రీ లీల….ప్రస్తుతం ఏం చేస్తుందో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమా అవకాశాలను అందుకున్నటువంటి వారిలో నటి శ్రీ లీల ( Sreeleela ) ఒకరు.

పెళ్లి సందడి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె మొదటి సినిమాతో ఫర్వాలేదు అనిపించుకున్న తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోల చూపు దర్శక నిర్మాతలు చూపు ఈమె పైనే పడింది.

దీంతో ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. """/" / ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె నటించిన ఏ ఒక్క సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

స్కంద సినిమా నుంచి మొదలుకొని ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచాయి.

ఇక ఈమె నటించిన గుంటూరు కారం భగవంత్ కేసరి వంటి సినిమాలు పరవాలేదు అనిపించుకున్నాయి.

ఇలా శ్రీ లీల వరుస సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈమెకు సినిమా అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయని తెలుస్తుంది.

"""/" / ఇలా ప్రస్తుతం ఈమె చేతిలో సినిమాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చేశారు.

అయితే శ్రీ లీల పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustad Bhagath Singh ) సినిమాలో నటిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎన్నికల హడావిడిలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

ఎన్నికలు పూర్తి అయ్యేవరకు పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనరు.దీంతో శ్రీ లీల ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు.

ఇలా ఖాళీగా ఉన్నటువంటి ఈమె తన స్టడీస్ పై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.

ఈమె ఎంబిబిఎస్ ( MBBS ) చేస్తున్న విషయం మనకు తెలిసిందే.చదువుతున్న సమయంలోనే సినిమా అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలోకి వచ్చారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో గ్యాప్ దొరకడంతో తిరిగి తన స్టడీస్ పై ఫోకస్ పెట్టారు.

 .

యూకే సార్వత్రిక ఎన్నికలు.. ఇద్దరు తెలుగు అభ్యర్ధుల ఓటమి