ప్రశాంత్ నీల్ సినిమా కోసం మరోసారి సాహసం చేయబోతున్న ఎన్టీఆర్?
TeluguStop.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) దేవర సినిమా ( Devara Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబడుతుంది.
ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో ఈ సినిమా కలెక్షన్లు ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావడంతో ఈయన క్రేజ్ మరింత పెరిగిపోయింది.
ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు.
"""/" /
ఎన్టీఆర్ త్వరలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా ప్రారంభం అయ్యాయి.
అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు జరగనున్నాయి.ఇక ఈ సినిమా షూటింగ్స్ త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమా కేవలం ఒక భాగంలోనే పూర్తి అవుతుందని తెలుస్తుంది.అంతేకాకుండా ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్( Rukmini Vasanth) హీరోయిన్ గా నటించబోతున్నట్టు సమాచారం.
"""/" /
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కాస్త భిన్నంగా ఉండబోతుందని ఎన్టీఆర్ పాత్ర కోసం ఆయన కాస్త శరీర బరువు పెరగాలని ప్రశాంత్ నీల్ చెప్పినట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ గతంలో కూడా శరీర బరువు కారణంగా ఎన్నో రకాల విమర్శలను ఎదుర్కొన్నారు.
అయితే తన శరీర బరువుపై విమర్శలు వస్తున్న తరుణంలో ఈయన ఎంతో కష్టపడి సాధారణ స్థాయికి వచ్చి మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా లుక్ పరంగా ఎన్టీఆర్ ప్రస్తుతం చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు అలాంటిది మరోసారి ఈయన ప్రశాంత్ సినిమా కోసం శరీర బరువు పెరుగుతూ మరో సాహసం చేస్తున్నారని చెప్పాలి.
తమిళ్ ఇండస్ట్రీ ని పాన్ ఇండియాలో నిలిపే సత్తా ఆ స్టార్ హీరోకే ఉందా..?