ఆ వృత్తిలోకే ఎన్టీఆర్ కుమారులు.. అభిమానులకి ఇది జీర్ణించుకోలేని విషయమే?

సినిమా ఇండస్ట్రీ( Film Industry )లో ఉండే సెలెబ్రిటీలో తమ వారసులుగా తమ పిల్లలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు.

ఇలా ఎంతోమంది వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు ఎన్టీఆర్ ( NTR ) ఒకరు.

హరికృష్ణ కుమారుడిగా సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ సాధించారు.

బాల నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఎన్టీఆర్ అతి చిన్న వయసులోనే హీరోగా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో( Pan India Star Hero )గా కొనసాగుతూ ఉన్నటువంటి ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలకు అలాగే బాలీవుడ్ సినిమాలకు కూడా కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

ఇకపోతే ఎన్టీఆర్ కి ఇద్దరు కుమారులు( NTR Sons ) అనే విషయం మనకు తెలిసిందే.

"""/"/ ఇలా ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్( Abhay Ram ) రెండవ కుమారుడు భార్గవ్ రామ్( Bhargav Ram ).

ఇక వీరిద్దరు కూడా ఎన్టీఆర్ వారసులుగా తప్పకుండా ఇండస్ట్రీలోకి వస్తారని అందరూ భావిస్తున్నారు కానీ తాజాగా ఎన్టీఆర్ కుమారుల సినీ ఎంట్రీ గురించి ఒక వార్త వైరల్ గా మారింది.

ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల పిల్లలు బాగా నటులు గాని ఇండస్ట్రీలోకి వస్తున్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం తన పిల్లలను దూరంగా పెట్టారు.

ఎన్టీఆర్ కు తన ఇద్దరి కొడుకులను సినిమా ఇండస్ట్రీలోకి( Film Industry ) తీసుకురావడం ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది.

తన ఇద్దరి కుమారులను హీరోలుగా కాకుండా మరో వృత్తిలో స్థిరపడేలా చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నారట.

వారసత్వం కాదు అని పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చేయించాలి అని.

డిసైడ్ అయ్యారట .అందుకే తన కొడుకులు అభయ్ రాం, భార్గవ్ రామ్ ఇద్దరినీ ఇండస్ట్రీలోకి కాకుండా నలుగురికి ఉపయోగపడే రంగంలోకి పంపించాలని భావిస్తున్నారట.

"""/"/ ఇక వీరిద్దరిని హీరోలుగా చేయడం కంటే కూడా డాక్టర్లుగా ( Doctors )చేయడం మంచిదని ఎన్టీఆర్ భావించారట.

అందుకే ఇప్పటినుంచి వారిని అదే దిశగా పంపించేలా ఈయన ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఇక ప్రణతి కూడా ఇదే డెసిషన్ తీసుకుందట .

దీంతో నందమూరి ఫ్యాన్స్( Nandamuri Fans ) డీలా పడిపోతున్నారు .జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ స్థానం దక్కించుకునేది భార్గవ్ రామ్ - అభయ్ రామ్ అంటూ ఇన్నాళ్లు ఆశపడ్డారు.

కానీ తన కొడుకుల విషయంలో ఎన్టీఆర్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారనే విషయం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.

మరి నిజంగానే ఎన్టీఆర్ వీరిద్దరిని ఇండస్ట్రీకి దూరం పెడతారా లేకపోతే పెద్దయిన తర్వాత వారి నిర్ణయాలను మార్చుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.

ఆ హీరోయిన్ కెరీర్ వాళ్ళ అమ్మే నాశనం చేసింది : మురళి మోహన్