Allu Arjun : హీరోయిన్ నడుము గిల్లడానికి బన్నీ ఇంత ఇబ్బంది పడ్డారా… ఇది నిజంగా అవమానమే?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమా( Pushpa Movie ) తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు.
అప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగుతున్నటువంటి ఈయన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇలా సుకుమార్ దర్శకత్వంలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో జరిగే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన ఆదరణ సంపాదించుకోవడంతో ఈయనకు కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ సినిమా షూటింగ్ ప్రారంభించారు.
"""/" /
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు గానూ ఏకంగా నేషనల్ అవార్డు( National Award ) వచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమాలో ఒక సన్నివేశంలో హీరోయిన్ నడుము గిల్లమంటే అల్లు అర్జున్( Allu Arjun ) నేను చస్తే నడుముగిళ్ళను అంటూ మొండి చేశారట.
ఈ విషయం తెలియడంతో నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ముఖ్యంగా అబ్బాయిలు హీరోయిన్ నడుము గిల్లకపోవడం ఏంటి బన్నీ ఇది నిజంగా మన మగ జాతికే అవమానం అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
"""/" /
అల్లు అర్జున్ హీరోయిన్ నడుము గిల్లమని డైరెక్టర్ చెప్పడంతో ఆయన సస్తే ఆ పని చేయనని చెప్పారట అయితే ఈయన మహిళలకు అలాంటి గౌరవం ఇస్తారని చెప్పకనే చెప్పేశారు.
ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.ఈ పాటలో సమంత ( Samantha ) నటించి మెప్పించారు.
ఈ పాటలో భాగంగా సమంత నడుము గిల్లే సన్నివేశం ఒకటి ఉంది.అయితే ఆ సీన్ చేయటం కోసం అల్లు అర్జున్ చాలా టేక్స్ తీసుకున్నారట.
ఇది సినిమాలో భాగమే చెయ్యి బాబు అంటూ సుకుమార్ ( Sukumar ) చెప్పినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం మాట వినలేదట ఇక సమంత కూడా యాక్టింగ్ లో ఇది ఒక భాగమే అని చెప్పి అల్లు అర్జున్ కాంప్రమైజ్ చేసిన వినలేదు ఇక చివరికి సుకుమార్ సీరియస్ అవ్వడంతో కేవలం తన నడుము గిల్లినట్లు యాక్ట్ చేశారు.
"""/" /
ఇలా బన్నీ యాక్ట్ చేయడంతో దానిని మనకి విజువలైజేషన్లో గిల్లుతున్నట్లు చూపించారు సుకుమార్.
అంత సిగ్గు మన బన్నీకి అమ్మాయిలు అంటే .కానీ మాటలు మాత్రం బాగా మాట్లాడుతాడు .
దీంతో ఇదే న్యూస్ ను బన్నీ ఫ్యాన్స్ సరదాగా ట్రెండ్ చేస్తున్నారు.ఇక ఈ విషయం తెలిసినటువంటి మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ వామ్మో అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి ( Sneha Reddy ) అంతా కంట్రోల్లో పెట్టారా కనీసం హీరోయిన్ల పై చేయి వేయడానికి కూడా ఆయన అంతగా వెనకాడుతున్నారు అంటే తన భార్య ఎలా కంట్రోల్ చేస్తున్నారో స్పష్టంగా అర్థం అవుతుంది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
పుష్ప ది రూల్ మూవీ రీలోడెడ్ వెర్షన్ టికెట్ రేట్లు ఇవే.. టికెట్ రేట్లు ఎంతంటే?