Aishwarya Arjun : తెలుగు స్టార్ హీరో ఇంటికి కోడలు కావాల్సిన ఐశ్వర్య అర్జున్ తమిళ స్టార్ ఇంటికి కోడలు అవుతుందా?
TeluguStop.com
కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హీరో అర్జున్( Arjun ) తెలుగు తమిళ భాష చిత్రాలలో కూడా నటించే ఇక్కడ కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఈయన తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళ కన్నడ భాషలలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అర్జున్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తున్నారు.
ఇలా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నటువంటి ఈయన మరోవైపు డైరెక్టర్ గా కూడా మారిపోయారు.
ఇక అర్జున్ పలు రియాలిటీ షోలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
"""/"/
ఇక హీరో అర్జున్ కు ఇద్దరు కుమార్తెలు అనే విషయం మనకు తెలిసిందే.
ఇప్పటికే ఈయన పెద్ద కుమార్తె ఐశ్వర్య( Aishwarya Arjun ) ను హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
ఈమె కన్నడ తమిళ భాష చిత్రాలలో నటించారు.అయితే తెలుగులో కూడా ఈమెను హీరోయిన్ గా పరిచయం చేయాలని అర్జున్ అన్ని ఏర్పాట్లు చేశారు.
టాలీవుడ్ హీరోలలో ఒకరైనటువంటి విశ్వక్ సేన్ హీరోగా అర్జున్ దర్శకత్వంలోనే తన కుమార్తెను తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం చేయాలని అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అన్న క్రమంలో హీరో విశ్వక్( Hero Vishwak Sen ) ఈ సినిమాలో తాను నటించనని చెప్పారు దీంతో అప్పట్లో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున వివాదంగా మారింది.
ఇక ఈ వివాదం కారణంగా ఈ సినిమా కాస్త ఆగిపోయింది.ఇకపోతే తాజాగా ఐశ్వర్య అర్జున్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది.
ఈమె గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.
ఈమె ప్రముఖ తమిళ కమెడియన్ తంబి రామయ్య( Thambi Ramaiah ) కుమారుడు హీరో ఉమాపతితో ప్రేమలో పడ్డారంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే ఈ వార్తలు నిజమేనని ఇరువురి కుటుంబ సభ్యులు వీరిద్దరి నిశ్చితార్థం చెన్నైలో ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు.
ప్రస్తుతం వీరిని నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి అయితే తాజాగా ఈమె గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
"""/"/
ఐశ్వర్య అర్జున్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతి( Umapathy ) ని ప్రేమిస్తున్నారనే విషయం అర్జున్ కి తెలియకపోవడంతో ఈయన తన కుమార్తెను టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి బడా స్టార్ ప్రొడ్యూసర్ ఇంటికి కోడలుగా పంపించాలని నిర్ణయం తీసుకున్నారట.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నటువంటి ఈయన కుమారుడు కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు ఇలా ఆ హీరోకి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని అర్జున్ భావించి ఆ విధంగానే ఏర్పాట్లు చేసే పనులలో బిజీగా ఉన్నారు.
"""/"/
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక హీరో ఇంటికి తనని కోడలుగా పంపించాలని అర్జున్ భావిస్తున్నటువంటి తరుణంలోనే తన కుమార్తె తంబి రామయ్య కుమారుడు ఉమాపతిని ప్రేమిస్తుందనే విషయం తెలిసిందట.
ఇలా తన కుమార్తె ప్రేమ గురించి తెలియడంతో ఇక చేసేదేమీ లేక అర్జున్ తన కుమార్తె ప్రేమ పెళ్లికి గ్రీన్ సిగ్నల్( Aishwarya Arjun Love Story ) ఇచ్చారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే వీరిద్దరి నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిపించారు.త్వరలోనే వీరిద్దరి వివాహం కూడా జరగబోతుంది ఇక తమిళ ఇండస్ట్రీలో తంబి రామయ్య ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక ఈయన కుమారుడు ఉమాపతి కూడా పలు సినిమాలలో నటించారు.అయితే ఈ రెండు కుటుంబాల మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉంది ఇలా వీరిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ కావడంతో ఐశ్వర్య ఉమాపతి ప్రేమలో పడిందని తెలుస్తోంది.
ఏది ఏమైనా తెలుగింటి కోడలు కావలసిన ఐశ్వర్య ఇలా తమిళ స్టార్ ఇంటి కోడలుగా అడుగు పెడుతుందని చెప్పాలి.
బ్రహ్మానందం సినిమాలు తగ్గించడానికి అసలు కారణమిదా.. ఆయన ఏం చెప్పారంటే?