బ్రహ్మానందం రెండో కొడుకు గురించి మీకు తెలుసా….?
TeluguStop.com
టాలీవుడ్ సినీ పరిశ్రమలో కొంత మంది సినీ నటీ నటులు తమ వారసులను పరిచయం చేసినప్పటికీ తమ తల్లిదండ్రుల మాదిరిగా పిల్లలు రాణించలేక పోతున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే కొంతమంది సినిమా పరిశ్రమను వదిలిపెట్టి ఇతర వ్యాపార రంగాలపై దృష్టి సారించి బాగానే రాణిస్తున్నారు.
మరికొందరు మాత్రం స్టార్ ఇమేజ్ ని దక్కించుకుని బాగానే ప్రేక్షకులను అలరిస్తున్నారు.తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన హాస్య నటనతో దాదాపుగా మూడు దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు "పద్మశ్రీ బ్రహ్మానందం" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
కాగా నటుడు బ్రహ్మానందానికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇందులో బ్రహ్మానందం పెద్ద కొడుకు రాజా గౌతమ్ ఆ మధ్య టాలీవుడ్ ప్రముఖ సీనియర్ దర్శకుడు కె.
రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన "పల్లకిలో పెళ్లికూతురు" అనే చిత్రంలో హీరోగా నటించి హీరోగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు.
వచ్చీరావడంతోనే తన మొదటి చిత్రంతో రాజా గౌతమ్ తెలుగు సినీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాడు.
కానీ తన తదుపరి చిత్ర కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో హీరోగా అవకాశాలను దక్కించుకోలేకపోయాడు.
దీంతో అప్పుడప్పుడు అడపాదడపా చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు.ఇక బ్రహ్మానందం రెండో కొడుకు విషయానికి వస్తే అతడి పేరు సిద్ధార్థ కన్నెగంటి.
ఇతడు ప్రస్తుతం ఇతర దేశాల్లో చదువుకుంటున్నాడు. అందువల్ల సినిమా పరిశ్రమకు కొంతమేర దూరంగా ఉంటున్నాడు.
అయితే ఇటీవలే సిద్ధార్థ తన చదువును పూర్తి చేసుకోవడంతో తొందర్లోనే టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం కాబోతున్నాడని కొందరు చర్చించుకుంటున్నారు.
కానీ సిద్ధార్థ మాత్రం వ్యాపార రంగంలో రాణించేందుకు ఆసక్తి చూపుతున్నాడట.
యూఎస్ కాంగ్రెస్‌లో ఆరుగురు భారత సంతతి నేతల ప్రమాణ స్వీకారం!!