విజయవాడ టీడీపీలో ఆసక్తికరంగా కేశినేని నాని ఎపిసోడ్..!!

విజయవాడ టీడీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.ఎంపీ కేశినేని నాని( MP Kesineni Nani ) వ్యవహారం సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది.

ఈ క్రమంలోనే కేశినేని భవన్ పై ఉన్న టీడీపీ జెండాలను( TDP Flags ) తొలగించారు.

అయితే టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేశినేని తన పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరోవైపు తిరువూరు సభ నేపథ్యంలో కేశినేని నాని కోసం కుర్చీని సైతం ఏర్పాటు చేశారు.

అయితే కేశినేని నాని మాత్రం తిరువూరుకు వెళ్లకుండా విజయవాడలో( Vijayawada ) ఉన్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కేశినేని నాని వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

దిష్టి మొత్తం పోయింది బాబాయ్.. అల్లు అర్జున్ అరెస్టుపై మనోజ్ కామెంట్స్!