కాదన్న మురారి.. కాళ్లమీద పడ్డాడు... అదీ ఎన్టీఆర్ అంటే.

అవి తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసులో ఉన్న రోజులు.ప్రముఖ నిర్మాత మురారి గోరింటాకు అనే సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించాడు.

ఈ సినిమా అప్పట్లో భారీ స్థాయిలో నిర్మించాలనుకున్నాడు.ఈ సినిమా షూటింగ్ కోసం అంతా వైజాగ్ కు బయల్దేరారు.

ఆ సమయంలో ఎన్టీఆర్ పోలీసుల కోసం నిధులు సేకరించాలి అనుకున్నాడు.అందులో భాగంగానే రైల్లో విశాఖకు చేరుకున్నాడు.

అదే సమయంలో గోరింటాకు సినిమా గురించి తనకు తెలిసింది.దాసరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుసుకున్నాడు.

ఈ సినిమా నిర్మాత ఎవరో తెలుసుకుని.గోరింటాకు సినిమా ఆర్టిస్టులను విశాఖలోని పరేడ్ గ్రౌండుకు తీసుకురావాలని కోరాడు.

అయితే ఆయన కోరిక నిర్మాత మురారికి నచ్చలేదు.ఆయన ఏదో కార్యక్రమం పెట్టుకుంటే తాము షూటింగ్ ఆపేసి ఎందుకు వెళ్లాలి? అని సీరియస్ అయ్యాడు.

ఇంతలో దాసరి కలుగజేసుకున్నాడు.ఎన్టీఆర్ గారు పిలిస్తే రాకుండా ఎలా ఉంటాం.

అందరం వస్తాం అని చెప్పాడు.మురారికి దాసరి మాటలు నచ్చలేదు.

మీరు వెళ్లండి నేను రాను అన్నాడు.అప్పుడు సావిత్రి కలుగజేసుకుంది.

మురారి గారు.మేమంతా ఉన్నా.

ఎన్టీఆర్ మీ దగ్గరికే మనిషిని ఎందుకు పంపించాడు? మీరు నిర్మాత కాబట్టి.ఆ గౌరవం ఇచ్చాడు అని చెప్పింది.

"""/" / మొత్తానికి అందరూ ఒప్పించారు మురారిని.అయితే తాను అక్కడికి వచ్చినా.

ఎన్టీఆర్ కు దండా వేయనని చెప్పాడు.శోభన్ బాబు నవ్వుతూ.

మురారీ నువ్వు తప్పకుండా ఆయనకు దండ వేస్తావని చెప్పాడు.అనుకున్నట్లుగానే సాయంత్రం పూట మురారి గోరింటాకు టీంతో అక్కడికి చేరుకున్నాడు.

అక్కడికి వెళ్లగానే ఎన్టీఆర్ వీరికి ఘన స్వాగతం పలికారు.నిర్మాత మురారి గారికి ధన్యవాదాలు అని చెప్పాడు.

"""/" / ఎన్టీఆర్ నోట ఆమాటలు వినగానే ఆయన మనసు మనసులో లేదు.

రండి మురారి గారు అని ఎన్టీఆర్ పిలిచారు.ఆయన కాళ్లలో వణుకు, కళ్లలో భయం ఉర్పడింది.

దండ ఎవరిచ్చారో తెలియదు కానీ.ఎన్టీఆర్ కు వేసి దండం పెట్టాడు.

ఎన్టీఆర్ ను చూడగానే ఓ కొత్త అనుభూతికి లోనయ్యాడు మురారి.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలివే.. వెంకీ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్లా?