నాగచైతన్య గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రెండు ప్రముఖ కుటుంబాల వారసుడు అయిన నాగచైతన్య సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు.

క్లాస్ కథలతో ఎక్కువగా విజయాలను సొంతం చేసుకున్న ఈ హీరో సినిమాసినిమాకు ఎదుగుతూ మార్కెట్ ను పెంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

వరుస విజయాలతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్న నాగచైతన్యను అభిమానులు ముద్దుగా చైతూ అని పిలుచుకుంటారు.

పక్కింటి కుర్రాడిలా కనిపించే నాగచైతన్య హైదరాబాద్ లో జన్మించారు.తల్లి లక్ష్మి దగ్గర పెరిగిన చైతన్య చెన్నైలోని పీ.

ఎస్.బీ.

బీలో స్కూలింగ్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ కు తిరిగొచ్చారు.యావరేజ్ గా చదివే నాగచైతన్య టీనేజ్ లో ఉన్న సమయంలో లావుగా ఉండేవారు.

స్నేహితులు చైతన్యను డంబూ అని పిలిచేవారు.కెరీర్ విషయంలో క్లారిటీ లేని చైతన్య తర్వాత రోజుల్లో బరువు తగ్గి సినిమాలపై ఆసక్తి చూపించారు.

"""/"/ యాక్టింగ్ స్కూల్ లో ఏడాదిన్నర శిక్షణ తీసుకున్న చైతన్య, దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన జోష్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

వేగంగానే సినిమాలు చేసిన చైతన్య తన నటనతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.

"""/"/ మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండే ఈ హీరో పర్సనల్ లైఫ్ ను ప్రైవేట్ గానే ఉంచాలని అనుకున్నారు.

సినిమాల్లోకి రాకముందు చైతన్య రేసర్ కావాలని అనుకున్నారు.చైతన్య దగ్గర ఖరీదైన బైక్ లు, కార్లు ఉన్నాయి.

నాగచైతన్య ప్రస్తుతం నటిస్తున్న బంగార్రాజు టీజర్ తాజాగా విడుదలైంది.నాగచైతన్య ఖాతాలో బంగార్రాజుతో మరో హిట్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

చైతన్య భార్య పాత్రలో ఈ సినిమాలో కృతిశెట్టి నటిస్తున్నారు.కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగు వాళ్ళతోనే మాకు పోటీ అంటున్న తమిళ్ డైరెక్టర్స్…