తారక్ రిజెక్ట్ చేసిన మూడు కథలతో రవితేజ స్టార్ అయ్యారా.. ఏమైందంటే?
TeluguStop.com
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో రిజెక్ట్ చేసిన కథలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి.
ప్రతిరోజూ పదుల సంఖ్యలో డైరెక్టర్లు కథలు చెబుతుండటంతో ఏ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలో ఏ కథకు నో చెప్పాలో తారక్ కు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.
అయితే తారక్ రిజెక్ట్ చేసిన కథలు రవితేజ కెరీర్ కు మాత్రం హెల్ప్ అయ్యాయి.
వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన తారక్ రిజెక్ట్ చేసిన కథలతో రవితేజ స్టార్ స్టేటస్ ను అందుకున్నారు.
కెరీర్ తొలినాళ్లలో మాస్ సినిమాలలో నటించిన తారక్ తో చాలామంది దర్శకులు మాస్ సినిమాలు తీయాలని భావించారు.
స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను భద్ర కథను తారక్ కు చెప్పగా కథ నచ్చినా ఒక్కడు సినిమా పోలికలు ఉండటం, ఇతర కారణాల వల్ల ఈ సినిమాలో నటించడానికి తారక్ అంగీకరించలేదు.
ఆ తర్వాత ఇదే కథలో నటించడానికి రవితేజ అంగీకరించడం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడం జరిగింది.
ఆ తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన కిక్ సినిమాలో నటించే అవకాశం మొదట ఎన్టీఆర్ కు దక్కగా కొన్ని కారణాల వల్ల తారక్ ఆ సినిమాను వదులుకున్నారు.
ఆ తర్వాత రవితేజ ఇదే కథలో నటించి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.
వీవీ వినాయక్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా తెరకెక్కిన కృష్ణ సినిమాలో నటించే అవకాశం మొదట తారక్ కు దక్కింది.
"""/"/
అయితే తారక్ వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమాలో నటించడానికి అంగీకరించలేదు.
ఈ విధంగా తారక్ వదులుకున్న కథలు రవితేజకు లక్ ను తెచ్చిపెట్టాయి.తారక్ ఈ సినిమాలలో నటించి ఉంటే మాత్రం తారక్ ఖాతాలో మరో మూడు బ్లాక్ బస్టర్ హిట్లు చేరి ఉండేవని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వైరల్ వీడియో: కోట్ల విలువైన విమానానికి గాలి ఇలా కొడుతున్నాడు!