లైఫ్ ఇచ్చిన దర్శకుడు చనిపోతే సూపర్ స్టార్ కృష్ణ ఏం చేశారో తెలిస్తే షాకవ్వాల్సిందే?

సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.

కృష్ణకు లైఫ్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్లలో ఆదుర్తి సుబ్బారావు కూడా ఒకరు.ఆదుర్తి సుబ్బారావు కృష్ణతో తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

అయితే ఆదుర్తి సుబ్బారావు ఆకస్మిక మరణం హీరో కృష్ణను ఎంతగానో బాధపెట్టింది.సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో సిరిమల్లె నవ్వింది సినిమా కూడా ఒకటి.

అయితే ఈ సినిమా నిర్మాణం వెనుక ఆసక్తికర కథ ఉంది.హవీష్, సింగరాజు రామచంద్రమూర్తి, ఆదివిష్ణు ఈ సినిమాకు రచయితలుగా పని చేశారు.

వివసువు అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.ఆదుర్తి సుబ్బారావు మరణం తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు కృష్ణ అండగా నిలవడంతో పాటు ఏ కష్టం వచ్చినా తన వంతు సహాయం చేసేవారు.

అయితే కృష్ణను ఇబ్బంది పెడుతున్నామని భావించి ఆదుర్తి కుటుంబ సభ్యులు సొంతూరికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.

అయితే కృష్ణ మాత్రం వాళ్లను అక్కడే ఉండాలని కోరడంతో పాటు సినిమా నిర్మాణాన్ని కొనసాగించమని సూచించారు.

"""/" / సిరిమల్లె నవ్వింది సినిమాకు నిర్మాతగా వ్యవహరించాలని వాళ్లను కోరారు.

ఆ తర్వాత కృష్ణ అప్పట్లో స్టార్ డైరెక్టర్ అయిన కె.విశ్వనాథ్ ను కలిసి సిరిమల్లె నవ్వింది సినిమాకు దర్శకత్వం వహించాలని కోరారు.

పారితోషికం బాధ్యత తనదని ఆ విషయంలో సందేహించవద్దని కృష్ణ విశ్వనాథ్ కు సూచించారు.

"""/" / అయితే విశ్వనాథ్ మాత్రం సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించడానికి ముందుకు రాలేదు.

ఆ తర్వాత ఈ సినిమాకు విజయనిర్మల దర్శకత్వం వహించి ఈ సినిమాను హిట్ చేశారు.

ఈ సినిమాలో కృష్ణకు జోడీగా సుజాత నటించడం గమనార్హం.ఈ విధంగా లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ చనిపోతే ఆ డైరెక్టర్ కుటుంబాన్ని ఆదుకోవడానికి కృష్ణ తీవ్రంగా శ్రమించారు.

ఎన్టీయార్ దేవర పాట హిట్టా ఫట్టా..?