అమెరికాలోని ఎన్నారైలు....ఈ గ్రామం గురించి మీకు తెలుసా...వెళ్ళారా...!!!

అభివృద్ధి, టెక్నాలజీ , ఫాస్టెస్ట్ కల్చర్, ఎన్నో రకాల హంగులు, ఇలా ఏ విషయంలో అయినా అమెరికాకు అమెరికానే సాటి.

అలాంటి అమెరికాలో కనీసం ఫోన్ కుడా వాడని ఊరు ఉంటుందంటే అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామం ఉందంటే మీరు నమ్ముతారా అస్సలు ఎవరూ నమ్మరు కానీ ఎలాంటి టెక్నాలజీ లేకుండా, సిటీ కల్చర్ కు దూరంగా ఓ గ్రామం అక్కడ కొందరు ప్రజలు బ్రతుకుతున్నారంటే నిజంగా షాకింగ్ విషయమే.

అయితే ఆ గ్రామానికి మాత్రం ప్రతీ ఏటా లక్షలాది మంది ప్రజలు వచ్చి వెళ్తూ ఉంటారట.

ఇంతకీ అక్కడ ఎంత మంది నివసిస్తున్నారు, వారి జీవిన విధానం ఏంటి అనే వివరాలలోకి వెళ్తే.

అమెరికాలో సుపాయ్ అనే గ్రామం ఉంది.బహుశా చాలా మందికి ఈ గ్రామం గురించి తెలియక పోవచ్చు .

భూమికి అత్యంత లోతైన ప్రాంతంలో ఈ గ్రామం ఉంది.ప్రతీ ఏటా పర్యాటకులు సుమారు 55 లక్షల మంది ఈ గ్రామానికి వస్తారట భూమికి 3 వేల అడుగుల లోతులో ఈ గ్రామం ఉంది.

ఇంతకీ ఇక్కడ నివసించే జనాభా ఎంత మందో తెలిస్తే షాక్ అవుతారు.ఈ గ్రామంలో నివసించే జనాభా కేవలం 208 మంది మాత్రమే.

ఇక్కడి ప్రజలు మాట్లాడే బాష హవాసుపాయి.ఈ గ్రామంలో రైలు మార్గం లేదు, కనీసం రోడ్డు మార్గం కూడా లేదు.

"""/"/ కాలి నడకన ఈ గ్రామం చేరుకోవాలి సిటీకి వెళ్లి రావడానికి ఇక్కడి వారు గుర్రాలు, గాడిదలను ఉపయోగిస్తుంటారు.

ఈ గ్రామంలో వెదురుతో అల్లిన బుట్టలు, వస్తువులను సిటీకి తీసుకువెళ్ళి అమ్ముకుని వస్తారు.

అలాగే పలు రకాల పంటలు పండించి వాటిని అమ్ముకుంటూ, జీవనం సాగిస్తుంటారు.ఈ మెయిల్స్, స్మార్ట్ ఫోన్, నెట్వర్క్ ఇలాంటి పదాలే వారికి తెలియవు, ఎలా వాటిని ఉపయోగించాలో కూడా ఎవరికీ తెలియదు.

ఈ గ్రామానికి రోజు వందలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు.అయితే ఈ గ్రామానికి రావాలంటే అక్కడి గిరిజన పెద్దల అనుమతులు తప్పనిసరిగా ఉండాల్సిందే.

సాయిపల్లవి అన్న అని పిలిస్తే అలా ఫీలయ్యాను.. శివకార్తికేయన్ కామెంట్స్ వైరల్!