సుమంత్ అశ్విన్ ప్రేమపెళ్లి కథ మీకు తెలుసా.. సినిమాకు మించిన ట్విస్టులతో?

చేసింది తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా సుమంత్ అశ్విన్ మంచి పేరును సొంతం చేసుకున్నారు.

తూనీగ తూనీగ సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన సుమంత్ అశ్విన్ అంతకుముందు ఆ తరువాత, లవర్స్, కేరింత సినిమాలతో నటుడిగా మంచి పేరును సంపాదించుకున్నారు.

అయితే ఈ సినిమాల తర్వాత సుమంత్ నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

వరుసగా సినిమాల్లో నటిస్తున్నా సరైన సక్సెస్ లేకపోవడంతో సుమంత్ అశ్విన్ కెరీర్ విషయంలో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు.

అయితే తాజాగా సుమంత్ అశ్విన్ తన ప్రేమపెళ్లి కథను పంచుకున్నారు.తన భార్య దీపికను తొలిసారి కజిన్ మ్యారేజ్ లో చూశానని చూసిన వెంటనే తనపై నాకు మంచి ఒపీనియన్ కలిగిందని సుమంత్ అశ్విన్ చెప్పుకొచ్చారు.

అదే సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లి గురించి ఆలోచిస్తున్నారని సుమంత్ అశ్విన్ పేర్కొన్నారు.

ఆ సమయంలో దీపికను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనిపించి తనకు ఫోన్ చేశానని ఆ తర్వాత దీపిక గురించి పేరెంట్స్ కు చెప్పానని సుమంత్ అన్నారు.

"""/"/ అయితే తన కుటుంబ సభ్యులు కూడా దీపికనే కోడలిగా చేసుకోవాలనే ఆలోచనతో ఆ సమయంలో ఉన్నారని సుమంత్ అశ్విన్ వెల్లడించారు.

పెళ్లి తర్వాత తాను సినిమాలతో బిజీగా ఉండగా దీపిక అమెరికాకు వెళ్లిపోయిందని సుమంత్ అశ్విన్ పేర్కొన్నారు.

"""/"/ ఇద్దరి మధ్య చిన్నచిన్న విషయాల్లో వాదనలు జరుగుతాయని గొడవలు మాత్రం జరగవని సుమంత్ అశ్విన్ వెల్లడించారు.

సుమంత అశ్విన్ ప్రేమపెళ్లి కథలో ఆసక్తికర ట్విస్టులు ఉన్నాయి.దీపిక మాట్లాడుతూ దూరంగా ఉండటం వల్లే ఒకరిపై మరొకరికి ప్రేమ పెరిగిందని తెలిపారు.

ఒకరికొకరు దూరంగా ఉన్నా ఇది తాత్కాలికమేనని ఆమె అభిప్రాయపడ్డారు.సుమంత్ అందరినీ గౌరవిస్తాడని అందరితో కలిసిపోతాడని దీపిక చెప్పుకొచ్చారు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్… సందడి చేసిన సినీ తారలు!