హీరోయిన్ సిమ్రాన్ చెల్లెలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అతనేనా?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో సిమ్రాన్ ఒకరనే సంగతి తెలిసిందే.
బాలకృష్ణ సిమ్రాన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
అయితే సిమ్రాన్ కు ఒక చెల్లి ఉందని చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు.
సిమ్రాన్ చెల్లెలు పేరు మోనాల్ నావెల్ కాగా ఇష్టం అనే సినిమాతో నటిగా ఈమె కెరీర్ మొదలైంది.
సిమ్రాన్ చెల్లెలు కావడంతో తక్కువ సమయంలోనే ఆమెకు ఊహించని స్థాయిలో సినిమా ఆఫర్లు వచ్చాయి.
పలు యాడ్స్ లో నటించి యాడ్స్ ద్వారా కూడా ఈమె ప్రశంసలు అందుకున్నారు.
అయితే ఆ తర్వాత ఈమె నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఆమె సూసైడ్ చేసుకోవడం గమనార్హం.
2002 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన ఆమె ఆత్మహత్య చేసుకుంది.ఆమె ఆత్మహత్య అభిమానులను ఎంతగానో బాధించడం గమనార్హం.
"""/" / అయితే ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ వల్లే ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అప్పట్లో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
సుజిత్ అనే కొరియోగ్రాఫర్ మోసం చేయడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
ఆమె ఆత్మహత్య ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టరీగానే మిగిలిపోయింది. """/" /
సినిమా ఇండస్ట్రీలో ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్న సెలబ్రిటీలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.
కొరియోగ్రాఫర్ తో పీకల్లోతు ప్రేమలో మోనాల్ మునిగిపోయారని మోసాన్ని అస్సలు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం అందుతోంది.
మరోవైపు హీరోయిన్ సిమ్రాన్ కు గతంతో పోల్చి చూస్తే సినిమా ఆఫర్లు ఊహించని స్థాయిలో తగ్గాయనే సంగతి తెలిసిందే.
సిమ్రాన్ మళ్లీ ఆఫర్లతో బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
వైరల్: జకార్తా వీధుల్లో నాగుపాము మాంసంతో వంటకాలు.. ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది!