నటి రమ్యకృష్ణ గురించి ఈ నిజాలు మీకు తెలుసా..?

ఒకప్పుడు సీనియర్ హీరోలకు జోడీగా నటించి నటిగా సత్తా చాటిన రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ ఉండటం గమనార్హం.

తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో రమ్యకృష్ణ నటించడం గమనార్హం.1985 సంవత్సరంలో భలే మిత్రులు మూవీతో రమ్యకృష్ణ కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ దాదాపు మూడు దశాబ్దాలుగా నటిగా కొనసాగుతున్నారు.

2003 సంవత్సరంలో రమ్యకృష్ణ కృష్ణవంశిని వివాహం చేసుకోగా వీరికి రిత్విక్ వంశీ అనే కుమారుడు ఉన్నారు.

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన నరసింహ మూవీ రమ్యకృష్ణ కెరీర్ ను మలుపు తిప్పింది.

హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత రమ్యకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు.

అయితే సినిమాల్లోకి రాకముందే రమ్యకృష్ణ నాట్యకారిణి కావడం గమనార్హం.నాట్యాన్ని ఎంతో అభిమానించే రమ్యకృష్ణకు దేశంలోని పలు ప్రధాన నగరాలలో నృత్య ప్రదర్శనలు ఇచ్చే అవకాశం దక్కింది.

"""/"/ ఒకవైపు గ్లామర్ రోల్స్ లో నటిస్తూనే మరోవైపు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లొ రమ్యకృష్ణ నటించారు.

రమ్యకృష్ణ సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసే షోలు కూడా చేశారు.రమ్యకృష్ణకు వినయ అనే చెల్లెలు ఉండగా ఆమె టేబుల్ టెన్నిస్ లో ఎన్నో బహుమతులను గెలుచుకోవడం గమనార్హం.

రమ్యకృష్ణ ప్రస్తుతం చెన్నైలో తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నారని తెలుస్తోంది. """/"/ కంటే కూతుర్నే కను, రాజు మహారాజు సినిమాలలో రమ్యకృష్ణ నటనకు మెచ్చి నంది పురస్కారాలు సైతం వచ్చాయి.

బాహుబలి సిరీస్ సక్సెస్ తరువాత రమ్యకృష్ణ పారితోషికాన్ని భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది.సినిమాను, బడ్జెట్ ను బట్టి రమ్యకృష్ణ పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.

శ్రీదేవి కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేయడంతో బాహుబలి సినిమాలోని శివగామి పాత్రకు రమ్యకృష్ణ ఎంపిక కావడం ఆ సినిమా సక్సెస్ సాధించడం జరిగింది.

యంగ్ హీరోలలో శ్రీవిష్ణును ఎంత మెచ్చుకున్నా తక్కువేనా.. ఎందుకంటే?