సాధారణంగా సూర్యుడికి ఉన్న శక్తి ద్వారా ఎలాంటి వారినైనా అంతమొందించే శక్తి కలిగిన వాడు సూర్యుడు.
అలాంటి సూర్యుడిని ఉదయించకుండా ఒక స్త్రీ ఆపింది.కొన్ని పురాణాలలో ఎంతో మంది పతివ్రతల గురించి మనం వినే ఉంటాం.
అలాంటి వారిలో మనం ఎక్కువగా విన్న పేరు సుమతి.సూర్యుని ఆపగలిగిన శక్తి ఈ సుమతికి ఎలా వచ్చింది.
తన కథ గురించి ఇక్కడ తెలుసుకుందాం.పురాణాల ప్రకారం ప్రతిష్టానపురంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు.
ఈ కౌశికుడు పరమ కోపిష్టి, ఇతర స్త్రీ లపై ఎంతో వ్యామోహంతో ఉండేవాడు.
కానీ ఇతని అదృష్టం మేరకు ఇతనికి భార్యగా సుమతి వచ్చింది.కౌశికుడు ఎంత కోపిష్టో, సుమతి అంత ఓర్పు కలిగినది.
శాంతి స్వరూపురాలు.అంతకుమించి మహా పతివ్రత అని చెప్పవచ్చు.
కౌశికుడు ఎన్నో చెడు తిరుగుళ్ళు తిరగడంతో అతడు రోగం తెచ్చుకుంటాడు.ఆ విధంగా కుష్టురోగంతో ఉన్నప్పటికీ సుమతి అతనిని వదలకుండా తనకు సేవ చేస్తూ ఉండేది.
"""/" /
ఇదిలా ఉండగా కౌశికుడు ఒకరోజు ఒక వేశ్యను చూశాడు.ఎలాగైనా తనను ఆమె దగ్గరకు తీసుకు వెళ్లాల్సిందిగా తన భార్యకు చెబుతాడు.
అప్పుడు సుమతి తన దగ్గరికి వెళ్లి వేశ్యను ఒప్పిస్తుంది.దీంతో సుమతి కౌశికుడిని తన భుజాలపై వేసుకొని వేశ్య దగ్గరకు వెళుతుండగా చీకటిలో కౌశికుడి కాలు ఒక మాండ్యమునికి తగులుతుంది.
ఆ విధంగా కౌశికుడి కాలు తగలడంతో ఆ ముని నన్ను బాధించిన నీ శరీరం సూర్యోదయం అయ్యే లోపు వెయ్యి ముక్కలవుతుందని శపించాడు.
ఆ ముని శాపం విన్న సుమతి ఎలాగైనా సూర్యోదయం కాకుండా ఉండాలని కోరుకోవడంతో సూర్యోదయం కాకుండా సమస్తం మొత్తం చీకటిగా ఉంటుంది.
లోకమంతా చీకటి మయం కావడంతో బ్రహ్మాది దేవతలు సైతం సుమతితో తల్లి.సూర్యోదయం కాకపోవడం వల్ల లోకాలన్నీ తలకిందులు అయిపోయాయి.
ఎలాగైనా నీ భర్తకు మరణం లేకుండా అతడిని ఆరోగ్యవంతునిగా చేస్తామని మాట ఇవ్వడంతో సుమతి తన శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది.
దీంతో సూర్యోదయం అయిన తర్వాత కౌశికుడు మరణిస్తాడు.వెంటనే సుమతి అక్కడికి చేరుకొని అతనికి తిరిగి ప్రాణం పోస్తుంది.
దీంతో అతను నవమన్మధుడుగా మారి ఆ బ్రహ్మాది దేవతలను నమస్కరిస్తారు.ఈ విధంగా సుమతి తను మహా ప్రాతివత్యం ద్వార ఏకంగా సూర్యుడిని ఉదయించకుండా ఆపగలిగింది.
బిగ్ బాస్ వల్ల నా జీవితం నాశనం అయ్యింది… ఎన్టీర్ మాట వినాల్సింది: సంపూర్ణేష్ బాబు