రుద్రాభిషేకం ఎలా చేయాలి.. చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా?
TeluguStop.com
పరమేశ్వరుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తారు.పరమశివుడి అనుగ్రహం పొందాలంటే పరమేశ్వరుడికి అభిషేకం చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది.
అయితే స్వామి వారికి చేసే అభిషేకాలలో రుద్రాభిషేకం ఎంతో ప్రీతికరమైనది.అయితే ఈ రుద్రాభిషేకం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి? రుద్రాభిషేకం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.
రుద్రాభిషేకం చేసే సమయంలో ఎన్నో నియమాలు పాటించి చేసినప్పుడే ఆ అభిషేకానికి ఫలితం కలుగుతుంది.
చాలామంది శివుడికి రుద్రాభిషేకం చేసే సమయంలో చెరువులో నుంచి లేదా నూతిలో నుంచి బిందెలతో తీసుకొచ్చి శివుడి పై వేస్తూ అభిషేకం చేస్తుంటారు.
ఇలా చేసిన అభిషేకానికి ఏ విధమైనటువంటి ఫలితం ఉండదు.ఇలా చెరువులలో తీసుకున్న నీటిలో విషపదార్థాలు ఉండటం చేత అలాంటి నీటితో అభిషేకం చేసిన ఫలితం శూన్యంగా ఉంటుంది.
కనుక శివుడికి రుద్రాభిషేకం చేసేటప్పుడు కలశంలో ఉంచిన నీటితో మాత్రమే అభిషేకం చేయాలని పండితులు చెబుతున్నారు.
శివుడికి రుద్రాభిషేకం చేసే సమయంలో శివలింగంపై మారేడు దళాలను ఉంచి ఒక్కొక్క కలశంలోని నీళ్ళతో కలశపూజచేసి ప్రతి కలశములో శివపంచాక్షరితో అభిమంత్రించాలి.
ఇలా ముందుగా 108 కళాశాలలో నీటిని సిద్ధం చేసుకొని ఆ నీటిని శివపంచాక్షరితో అభిమంత్రించి సిద్ధంగా పెట్టుకోవాలి.
ఇలా సిద్ధంగా చేసుకున్న నీటితో మాత్రమే శివుడికి అభిషేకం చేయాలి.ఇలా అభిషేకం పూర్తయ్యేసరికి కలశంలో ఉన్న నీరు మొత్తం సరిగ్గా సరిపోయేలా చూసుకోవాలి.
ఇలా మారేడు దళాలు ఉంచి కలశంలో ఉన్న నీటితో అభిషేకం చేసినప్పుడే శివుడికి రుద్రాభిషేకం పూర్తవుతుంది.
ఇలా చేసేన రుద్రాభిషేకానికే ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.
ఖలేజా టైటిల్ వల్ల వాళ్లు 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారట.. అసలేమైందంటే?