రమేష్ బాబు భార్య, పిల్లల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ప్రముఖ నటుడు కృష్ణ పెద్ద కొడుకు, స్టార్ హీరో మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ ​శనివారం రాత్రి మృతి చెందారు.

మహేష్ బాబు హోం ఐసోలేషన్ లో ఉండటంతో రమేష్ బాబు అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు.

ఎంతో అనుబంధం ఉన్న అన్నయ్యను చివరి చూపు కూడా చూసుకోలేకపోవడంతో మహేష్ బాబు చాలా బాధ పడ్డారని సమాచారం.

తండ్రి కృష్ణ బాధలో ఉండగా మహేష్ బాబుకు ఓదార్చలేని పరిస్థితి ఏర్పడింది.అయితే రమేష్ బాబు భార్య, పిల్లల గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.

రమేష్ బాబు సైతం సినిమాలకు దూరమైన తర్వాత అడపాదడపా సినిమా ఫంక్షన్లలో కనిపించడం మినహా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండేవారు కాదు.

2022 సంవత్సరంలో చోటు చేసుకున్న విషాద ఘటన సూపర్ స్టార్ మహేష్ అభిమానుల్ని బాధ పెడుతోంది.

కృష్ణ కుటుంబ సభ్యులు సైతం ఊహించని ఈ ఘటనను తట్టుకోలేకపోతున్నారు.రమేష్ బాబు వైఫ్ పేరు మృదుల కాగా ఈ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.

"""/" / కొడుకు పేరు జయకృష్ణ కాగా కూతురు పేరు భారతి అని సమాచారం.

అయితే రమేష్ బాబు భార్య కానీ పిల్లలు కానీ ఫంక్షన్లలో ఎక్కువగా కనిపించేవారు కాదు.

కొన్ని అలవాట్ల వల్లే ఆయనకు అనారోగ్య సమస్యలు వచ్చాయని చాలామంది చెబుతారు. """/" / మహేష్ బాబు రమేష్ బాబును విజయవంతమైన నిర్మాతగా నిలబెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.

రమేష్ బాబు నిర్మాతగా మహేష్ హీరోగా నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా ఫ్లాప్ అయ్యాయి.

అర్జున్, అతిథి సినిమాలు రమేష్ బాబుకు భారీమొత్తంలో నష్టాలను మిగిల్చాయని సమాచారం.

చెట్ల కొమ్మల్లో ఇరుక్కున్న ఆవు.. ఎలా కాపాడాడో చూస్తే..