చరణ్ కు అబద్ధం చెప్పి సమంతతో లిప్ లాక్ పెట్టించారట.. ఏమైందంటే?
TeluguStop.com
అటు రామ్ చరణ్ కెరీర్ లో ఇటు సమంత కెరీర్ లో రంగస్థలం సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే.
సుకుమార్ గత సినిమాలకు భిన్నంగా రంగస్థలం సినిమా ఉంటుంది.చరణ్ కు నటుడిగా కూడా ఈ సినిమా మంచి పేరును సంపాదించి పెట్టిన సినిమాగా రంగస్థలం పేరు తెచ్చుకుంది.
ఈ సినిమాలో చరణ్, సమంతల మధ్య ఒక లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది.
అయితే ఈ సన్నివేశంకు సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.సుకుమార్ రంగస్థలం కథ చెప్పిన సమయంలో కథ నచ్చడంతో ఆ సినిమాకు వెంటనే రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే సుకుమార్ సమంతతో లిప్ లాక్ సీన్ అని చెప్పగా అప్పటికే పెళ్లి కావడంతో చరణ్ లిప్ లాక్ సీన్ లో మాత్రం తాను నటించలేనని సుకుమార్ కు చెప్పుకొచ్చారు.
ఉపాసనకు కూడా లిప్ లాక్ సన్నివేశాలు ఇష్టం ఉండవని రామ్ చరణ్ సుకుమార్ కు తెలిపారు.
అయితే సుకుమార్ మాత్రం సినిమాలో ఆ సీన్ ఉంటే బాగుంటుందని భావించారు. """/"/
సుకుమార్ ఆ తర్వాత చరణ్ ను ఒప్పించాలని ప్రయత్నాలు చేసినా లిప్ లాక్ సీన్ లో నటించడం తన వల్ల కాదని చరణ్ అన్నారు.
ఆ తర్వాత సుకుమార్ ఒకరోజు సమంత పెదాలు దగ్గరికి వస్తాయని గ్రాఫిక్స్ లో కవర్ చేస్తామని చరణ్ కు చెప్పి సమంతకు మాత్రం ముద్దు పెట్టాలని సుకుమార్ సూచించారు.
సమంత సుకుమార్ చెప్పినట్టే చరణ్ కు ముద్దు పెట్టడంతో షాకవ్వడం చరణ్ వంతైంది.
"""/"/
ఆ తర్వాత చరణ్ అలగగా సుకుమార్ రామ్ చరణ్ ను బుజ్జగించి కష్టపడి కన్విన్స్ చేశారు.
సుకుమార్ మాత్రం ఎంతో కష్టపడి తను అనుకున్నది ఏదో ఒక విధంగా సాధించారు.
రంగస్థలం సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి దర్శకునిగా సుకుమార్ స్థాయిని సైతం పెంచిన సంగతి తెలిసిందే.
పెళ్లి కూతురుగా ముస్తాబయి డాన్స్ ఇరగదీసిన శోభిత.. వీడియో వైరల్!