బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్, మహేష్ ఫైట్.. విజేత ఎవరంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబులకు ప్రేక్షకుల్లో సమాన స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ పేరుతో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండగా మహేష్ బాబు భవిష్యత్తు సినిమాలు కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తెరకెక్కుతున్నాయి.

ఎన్టీఆర్, మహేష్ బాబు కలిసి నటించకపోయినా వేదికలపై పలు సందర్భాల్లో ఒకరిని మరొకరు మెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.

పలు సందర్భాల్లో ఈ ఇద్దరు హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి.

సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడగా వృత్తిరిత్యా వాళ్లిద్దరి మధ్య పోటీ ఉండేది.

ఈ పోటీలో కొన్నిసార్లు సీనియర్ ఎన్టీఆర్ పై చేయి సాధిస్తే కొన్నిసార్లు సూపర్ స్టార్ కృష్ణ పై చేయి సాధించారు.

సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ నట వారసులు మహేష్, జూనియర్ ఎన్టీఆర్ 2003లో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు.

జూనియర్ ఎన్టీఆర్ కు మాస్ ఆడియన్స్ లో భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే మహేష్ బాబుకు క్లాస్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

"""/"/ 2003 సంక్రాంతికి మహేష్ ఒక్కడు, ఎన్టీఆర్ నాగ రిలీజ్ కాగా ఒక్కడు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఒక్కడు సినిమా 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి 26 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం గమనార్హం.

"""/"/ 2003 సంవత్సరంలో ఐదు రోజుల గ్యాప్ లో ఈ రెండు సినిమాలు రిలీజ్ కావడం గమనార్హం.

ఒక్కడు సినిమా మాస్ ఫ్యాన్స్ లో మహేష్ బాబుకు భారీ స్థాయిలో క్రేజ్ ను పెంచడం గమనార్హం.

నాగ సినిమా ఫ్లాప్ అయినా ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువ మొత్తంలో నష్టాలను తెచ్చిపెట్టలేదు.

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఐదుగురు నిర్వాహకులు అరెస్ట్