చిరు, బాలయ్య, వెంకీ సినిమాల కథలు మార్చి మహేష్ తో సినిమాలు తీశారా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు రీమేక్ సినిమాలకు వ్యతిరేకం అనే సంగతి తెలిసిందే.

తనకు రీమేక్ సినిమాలలో నటించడం నచ్చదని మహేష్ బాబు గతంలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

అయితే మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన పలు సినిమాల కథలకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు కొన్ని పోలికలు ఉన్నాయి.

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నటించిన కథలను దర్శకులు కొంచెం మార్చి మహేష్ తో సినిమాలు తెరకెక్కించారు.

మహేష్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో శ్రీమంతుడు ఒకటనే సంగతి కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.

అయితే ఈ సినిమాకు కె.విశ్వనాథ్ డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా నటించిన జననీ జన్మభూమి సినిమాకు పోలికలు ఉన్నాయి.

సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి నటించిన అన్నాదమ్ముల అనుబంధం సినిమాకు కృష్ణ, మహేష్ కలిసి నటించిన ముగ్గురు కొడుకులు సినిమాకు పోలికలు ఉన్నాయి.

మహేష్ కెరీర్ లోని స్పెషల్ సినిమాలలో ఒకటైన అతడు బుల్లితెరపై, వెండితెరపై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

అయితే ఈ సినిమాకు వెంకటేష్ హీరోగా తెరకెక్కిన వారసుడొచ్చాడు సినిమాకు కొన్ని పోలికలు ఉన్నాయి.

మహేష్ కెరీర్ లోని ఇండస్ట్రీ హిట్ సినిమాలలో పోకిరి ఒకటనే సంగతి తెలిసిందే.

ఫుల్ రన్ లో ఈ సినిమా ఏకంగా 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.

"""/"/ అయితే ఈ సినిమాకు చిరంజీవి హీరోగా తెరకెక్కిన స్టేట్ రౌడీ సినిమాకు పోలికలు ఉన్నాయి.

చిరంజీవి, బాలయ్య, వెంకీ నటించిన సినిమా కథలను కొంచెం మార్చి దర్శకులు మహేష్ తో సినిమాలను తెరకెక్కించారు.

అయితే కథ కొంచెం మార్చినా మహేష్ బాబు ఈ సినిమాలతో విజయాలు అందుకున్నారు.

వైరల్ అవుతున్న క్లీంకార లేటెస్ట్ ఫోటోలు.. ఎంత ముద్దుగా ఉందో అంటూ?