కథ వినకుండా కృష్ణంరాజు నటించిన సినిమా ఏంటో తెలుసా?

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు.ఈయన మరణించడంతో ఈయన సినీ ప్రస్థానం గురించి పలువురు సినీ సెలెబ్రెటీలు కొనియాడుతూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక ఈయన 1966 లో చిలుకా గోరింక అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

ఇలా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృష్ణంరాజు అనంతరం ఎన్నో సినిమాలలో హీరోగా విలన్ పాత్రలలో నటించారు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో ఆరు దశాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటిస్తూ ఆరు దశాబ్దాల నుంచి చిత్ర పరిశ్రమకు తన సేవలు అందించారు.

ఇకపోతే సాధారణంగా ఒక సినిమా చేయాలంటే హీరో తప్పకుండా కథను మొత్తం వింటారు.

ఇలా ఆ కథ నచ్చితేనే సినిమాలు చేస్తారు.కథ వినకుండా సినిమాలు చేయడానికి ఏ హీరో సాహసం చేయరు.

కృష్ణంరాజు మాత్రం కథ వినకుండా తన జీవితంలో ఓ సినిమా చేశారు.అయితే ఊహించని విధంగా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయి అత్యధిక కలెక్షన్లను రాబట్టింది.

మరి ఈయన కథ వినకుండా హిట్ కొట్టిన ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే.

"""/"/ కృష్ణంరాజు డైరెక్టర్ దాసరి నారాయణ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం కటకటాల రుద్రయ్య.

కృష్ణంరాజు గారి సినిమాల గురించి ప్రస్తావన వస్తే తప్పకుండా ఈ సినిమా గురించి ప్రస్తావించుకోవాల్సిందే.

ఇప్పుడు ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాకు ఏ విధమైనటువంటి కలెక్షన్లు రాబట్టిందో అప్పట్లో కటకటాల రుద్రయ్య సినిమా కూడా అదే స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది.

1987లో వచ్చిన ఈ సినిమా కథ వినకుండా కృష్ణంరాజు గారు సినిమాలో నటించారు.

ఇలా కథ వినకుండా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో విజయం సాధించి ఆయన సినీ కెరియర్లో అద్భుతమైన చిత్రంగా నిలిచిపోయింది.

‘బస్సుల్లో డ్యాన్సులు ‘ స్పందించిన కేటీఆర్