కార్తీకదీపం సౌర్యగా కన్నడ బ్యూటీ.. ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్!

తెలుగు బుల్లితెర పై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో అత్యధికంగా ప్రేక్షకాదరణ పొందిన సీరియల్స్ లో మొదటి స్థానంలో కార్తీకదీపం సీరియల్ ఉంది.

ఇకపోతే ఇటీవలే ఈ సీరియల్ లో కార్తీక్, దీప లు చనిపోయిన విషయం తెలిసిందే.

గత రెండు రోజులుగా కార్తీకదీపం సీరియల్ కు సంబంధించిన ఒక ప్రోమో వైరల్ అవుతుంది.

ఆ ప్రోమో లో కార్తీక్ దీప పిల్లలు అయినా, సౌర్య, హిమ లు పెద్దవాళ్ళు అయినట్టుగా చూపిస్తున్నారు.

అయితే అందులో సౌర్య ఆటోడ్రైవర్ గా మారగా, హిమ డాక్టర్ గా మారుతుంది.

అయితే అందులో హిమ గా రాబోతున్న నటి కీర్తి బట్ మనందరికి సుపరిచితమే.

సౌర్య పాత్రలో ఆటోడ్రైవర్ గా కనిపిస్తున్న కొత్త అమ్మాయి ఎవరు అన్న ఆసక్తి అందరికీ మొదలైంది.

దీంతో ఆ అమ్మాయి ఎవరా అని చాలా మంది ఆసక్తి గా ఎదురు చూడడం  మొదలు పెట్టారు.

సౌర్య కార్తీకదీపం లో ప్రేక్షకుల లో ముందుకు రాబోతున్న కన్నడ అమ్మాయి పేరు అమూల్య గౌడ.

కర్ణాటక లోని మైసూర్ లో 1993 జనవరి 8న జన్మించింది.ఈమె కన్నడ లో కమలి అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే అమూల్య నటి కాక ముందు యారి గుంటు యారిగిల్ల అనే రియాల్టీ షో లో కనిపించింది.

ఆ తరువాత 2014లో కన్నడ స్వాతి ముత్తు అనే సీరియల్ ద్వారా నటిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

"""/" / ఆ తరువాత పునర్ వివాహ, అరమనే వంటి హిందీ, కన్నడ సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

అరమనే లో హిత అనే నెగిటివ్ లీడ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చు కుంది.

అయితే మన తెలుగు కార్తీక దీపం లానే కన్నడలో కమలి అనే సీరియల్ చాలా పాపులర్.

ఈ సీరియల్‌లో కమలిగా లీడ్ రోల్ చేసి.70 శాతంపైగా కన్నడ అభిమానుల్ని కూడ గట్టుకుంది అమూల్య.

మరి కన్నడలో బుల్లితెర ప్రేక్షకుల మనస్సు లలో స్థానం సంపాదించుకున్నా ఈ అమూల్య తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.

అనారోగ్యానికి గురైన సాయి పల్లవి… విశ్రాంతి తప్పనిసరి అంటున్న వైద్యులు!