తెలుగు వెండి తెరకు దొరికిన ఆణిమత్యం ఈ కన్నడ కస్తూరి..

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్ కావాలంటే ఇక్కడి ఫిల్మ్ మేకర్స్ అంతా.ముంబై వైపు చూసేవారు.

ఆ తర్వాత నెమ్మదిగా తమిళ, మలయాళ సినిమా పరిశ్రమల వైపు వెళ్లేవారు.కారణం.

అక్కడి వారికి మంచి నటన తెలుసు, కష్టపడతారు, కమిటెడ్ గా వర్క్ చేస్తారు, అందంగా ఉంటారు.

అందుకే అక్కడి వారితో సినిమాలు చేసేందుకు ఇష్టపడేవారు.ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ హీరోయిన్ల కోసం కన్నడ సినిమా పరిశ్రమ వైపు చూస్తున్నారు.

ఇప్పటికే బెంగళూరు బ్యూటీ రశ్మిక మందాన తెలుగు సినిమా పరిశ్రమను ఏలుతుంది.ఆమె వరుస సినిమాలతో ముందుకు వెళ్తోంది.

తాజాగా ఆమెకు పోటీగా వచ్చింది మరో బ్యూటీ.ఇంతకీ తను ఎవరో కాదు రచిత రామ్.

సంక్రాంత బరిలో నిలిచిన చిరంజీవి అల్లుడు మూవీ సూపర్ మచ్చిలో హీరోయిన్ గా చేసింది.

వాస్తవానికి ఈ సిమాకు రచిత ప్లస్ పాయింట్.సినిమా అంతా ఈమే కనిపిస్తుంది.

ఆమె ఈ సినిమాలో క్యారెక్టర్ లో దూరిపోయి నటించింది.నిజానికి ఇందులో తన క్యారెక్టర్ అంత గొప్పగా లేకపోయినా.

తన నటనతో ఆ క్యారెక్టర్ కు మంచి హైప్ తీసుకొచ్చింది.వాస్తవానికి హీరో కల్యాణ్ దేవ్ కూడా అంతగా నటించలేకపోయాడు.

పలు చోట్ల తన నటన తేలిపోయింది.ఆయన ఇంకా మెరుగు పడాలి.

ఈ సినిమా ద్వారా మంచి నటనను కనబర్చిన రచిత.ఎవరు? అని జనాలు ఆమె కోసం వెతుకుతున్నారు.

"""/"/ రచిత టీవీ సీరియల్స్ లో నటించేది.ఆమె చెల్లెలు నిత్యా రామ్ కూడా నటే.

ఇద్దరు మంచి నటీమణులుగా గుర్తింపు తెచ్చుకున్నారు.నెమ్మదిగా ఆమె సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి అద్భుత నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు డజన్ సినిమాలున్నాయి.ప్రస్తుతం శాండిల్ వుడ్ లో టాప్ పెయిడ్ హీరోయిన్ తను.

మొత్తానికి ఈ సినిమాలో అద్భుత నటనతో తెలుగు జనాలను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

ఈ టాలీవుడ్ లక్కీ హీరోయిన్ టాలెంట్ ఏంటో తెలిస్తే మాత్రం కచ్చితంగా షాకవ్వాల్సిందే!