స్టార్ హీరోయిన్ నయనతార జాతకంలో ఆ సమస్యలు.. చెట్టుతో పెళ్లంటూ?

స్టార్ హీరోయిన్లలో నయనతార రూటే సపరేట్ అనే సంగతి తెలిసిందే.భారీస్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునే నయనతార లేడీ సూపర్ స్టార్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం నయనతార చేతిలో చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు ఉన్నాయి.ఇప్పటికే విఘ్నేష్ శివన్ తో ఎంగేజ్ మెంట్ ను పూర్తి చేసుకున్న నయనతార త్వరలో విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోనున్నారు.

ప్రస్తుతం నయనతార వయస్సు 36 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తో కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న నయనతార స్టార్ హీరోలకు ధీటుగా క్రేజ్ ను, పాపులారిటీని సొంతం చేసుకోవడం గమనార్హం.

ప్రస్తుతం నయనతార, విఘ్నేష్ శివన్ గుడులు, గోపురాల చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నారు.అయితే నయనతార జాతకంలో కుజ దోషం ఉంది.

అందువల్ల నయనతార విఘ్నేష్ శివన్ కంటే ముందు చెట్టుకును పెళ్లి చేసుకోవాలని జ్యోతిష్కులు చెప్పినట్టు తెలుస్తోంది.

జ్యోతిష్కులు చెప్పిన సలహాలను, సూచనలను పాటిస్తానని నయనతార చెప్పినట్టు తెలుస్తోంది.విఘ్నేష్ శివన్ పెళ్లి తర్వాత కూడా క్షేమంగా ఉండాలనే ఆలోచనతో జ్యోతిష్కుల సూచనల మేరకు నయనతార ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

తాజాగా విఘ్నేష్ నయన్ శ్రీవారిని, షిరిడి సాయిబాబాను, సిద్ధి వినాయక్ టెంపుల్ ను, వరలక్ష్మీ ఆలయాన్ని సందర్శించారు.

"""/"/ గతంలో ఐశ్వర్యా రాయ్ కూడా మొదట చెట్టును పెళ్లి చేసుకున్నారు.ఆ తర్వాత ఐశ్వర్యా రాయ్ అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్నారు.

ఐశ్వర్యా రాయ్ చెట్టును పెళ్లి చేసుకోవడం గురించి జోరుగా చర్చ జరిగింది.అయితే నయనతారకు చెట్టుతో పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారం గురించి ఆమె ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

నయనతార కూడా ఇలాంటివి నమ్ముతారా? అంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సిఎం జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ