స్నేహను అనుకొని సిమ్రాన్ ను తీసుకొని జ్యోతికతో ఫినిష్ చేసిన మూవీ ఏదో తెలుసా?

సినిమా రంగంలో హీరోహీరోయిన్ల విషయంలో చాలా సందర్భాల్లో అనేక విచిత్రాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.

ఒక సినిమాలో ఎంపికైన హీరోలు, హీరోయిన్లకు బదులుగా ఇతర హీరోలు, హీరోయిన్లు నటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

కొన్ని సందర్భాల్లో కథ నచ్చినా వేర్వేరు కారణాల వల్ల సినిమాలను వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.

తమిళంలో, తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చంద్రముఖి మూవీ విషయంలో ఇదే విధంగా జరిగింది.

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన మనిచిత్రతాయు సినిమాకు రీమేక్ గా రజినీకాంత్ నటించిన చంద్రముఖి మూవీ తెరకెక్కింది.

ప్రముఖ దర్శకులలో ఒకరైన వి.ఎన్.

ఆదిత్య మనిచిత్రతాయు రీమేక్ ను తెలుగులో రీమేక్ చేయాలని అనుకోగా వేర్వేరు కారణాల వల్ల చిరంజీవి ఈ రీమేక్ పై పెద్దగా ఆసక్తి చూపలేదు.

అయితే మణిచిత్రతాయు సినిమాను చూసిన రజినీకాంత్ సినిమా నచ్చడంతో తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ లో నటించాలని అనుకున్నారు.

"""/"/ ఈ సినిమాలో జ్యోతిక చేసిన పాత్రకు మొదట హీరోయిన్ స్నేహను తీసుకోవాలని అనుకున్నారు.

అయితే ఆ తర్వాత జ్యోతికకు బదులుగా ఈ సినిమాలో సిమ్రాన్ ను తీసుకోవడం జరిగింది.

సిమ్రాన్ హీరోయిన్ గా షూటింగ్ మొదలైన తర్వాత ఆమె గర్భవతి కావడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.

ఆ తర్వాత పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించి చివరకు జ్యోతికను ఫైనల్ చేశారు.

"""/"/ ఈ సినిమాలో ప్రేక్షకులతో విజిల్స్ వేయించిన లకలకలక డైలాగ్ రజినీకాంత్ సొంతంగా పెట్టిన డైలాగ్ కావడం గమనార్హం.

రజినీకాంత్ రెమ్యునరేషన్ కాకుండా కేవలం ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది.

రజినీకాంత్ హీరోగా నటించి జర్మనీలో విడుదలైన తొలి తమిళ మూవీ ఇదే కావడం గమనార్హం.

తమిళనాడులోని ఒక థియేటర్ లో ఈ మూవీ 890 రోజులకు పైగా ఆడింది.

కువైట్‌‌కు అండగా నిలుస్తాం .. ప్రవాస భారతీయులతో నరేంద్ర మోడీ