హీరో కళ్యాణ్ రామ్ ను అలా అవమానించారా.. ఫెయిల్ అయ్యావ్ అంటూ?
TeluguStop.com
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి.
అదే సమయంలో కళ్యాణ్ రామ్ నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.
మరికొన్ని రోజుల్లో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
బాల గోపాలుడు సినిమాతో కళ్యాణ్ రామ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు.
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ 1989 సంవత్సరంలో నేను ఏడో తరగతి చదువుతున్నానని ఆ సమయంలో నాన్నగారిని బాబాయ్ బాలకృష్ణ కళ్యాణ్ రామ్ ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని అడిగారని చెప్పుకొచ్చారు.
నాన్నగారు చదువుకుంటున్నాడు కదా అని అనగా బాబాయ్ అవన్నీ నేను చూసుకుంటానని చెప్పారని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.
"""/" /
మా బాబాయ్ సినిమాలలో అక్షరాభ్యాసం చేయించాడని రామోజీ రావు నిర్మాతగా కాశీ విశ్వనాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన తొలి చూపులోనే నా మొదటిమూవీ అని ఆ మూవీతో నా ప్రస్థానం ఎలా మొదలైందో అందరికీ తెలుసని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.
నేను నటించిన తొలి రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయని అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఫెయిల్ అయ్యావని తన గురించి చెబుతుండేవారని కళ్యాణ్ రామ్ కామెంట్లు చేశారు.
"""/" /
ఫెయిల్యూర్ స్టెప్పింగ్ స్టోన్ అని ఆ సమయంలో సినిమా గురించి ఇంకా తెలుసుకోవాలనే కోరిక నాకు పుట్టిందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.
కళ్యాణ్ రామ్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.అప్ క్లోజ్ విత్ ఎన్కేఆర్ ఎపిసోడ్1 పేరుతో కళ్యాణ్ రామ్ ఈ వీడియోను రిలీజ్ చేయడం గమనార్హం.
కాస్కో ట్రంప్.. ‘రిపబ్లికన్స్ ఫర్ హారిస్’ ప్రారంభించిన కమలా హారిస్