ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన పాటలు ఇవే!

తెలుగులో ఫ్రెండ్ షిప్ ప్రధానంగా ఎన్నో సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలలోని పాటలు సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ ఏడాది విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాలలో ఆర్ఆర్ఆర్ మూవీ ఒకటనే సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమాలోని దోస్తీ పాట ఊహించని స్థాయిలో పాపులర్ అయింది.సినిమాలో రామ్ భీమ్ పాత్రల మధ్య స్నేహం గురించి చెప్పే ఈ పాట అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.

సిరివెన్నెల రాసిన ఈ పాటలోని సాహిత్యం ప్రేక్షకులను మెప్పించింది.మహర్షి సినిమాలోని చోటి చోటి బాతే పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

మహేష్, పూజా హెగ్డే, నరేష్ కాంబినేషన్ లో వచ్చే ఈ పాటకు ప్రేక్షకుల ప్రశంసలు దక్కాయి.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలోని ఇదేరా స్నేహం పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఉన్నది ఒకటే జిందగీ సినిమాలోని ట్రెండు మారినా పాట కూడా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.

ఓ మై ఫ్రెండ్ సినిమాలోని టైటిల్ సాంగ్ కూడా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.

"""/"/ ప్రేమ దేశం సినిమాలోని ముస్తఫా ముస్తఫా, నీ స్నేహం సినిమాలోని కొంతకాలం కిందట, స్నేహమంటే ఇదేరా సినిమాలోని స్నేహమంటే ఊపిరి కదరా, స్నేహితుడు సినిమాలోని మన ఫ్రెండల్లే, స్నేహం కోసం సినిమాలోని మీసమున్న నేస్తమా పాటలు స్నేహితుల గొప్పదనం గురించి చెబుతూ వచ్చిన పాటలు కావడం గమనార్హం.

"""/"/ నిప్పులాంటి మనిషి సినిమాలోని స్నేహమేనా జీవితం, ప్రాణస్నేహితులు సినిమాలోని స్నేహానికన్న మిన్న సాంగ్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో సైతం ఎంతోమంది సెలబ్రిటీలు స్నేహపూర్వకంగా మెలుగుతున్నారు.ఇతర భాషల్లో సైతం స్నేహానికి సంబంధించి వచ్చిన ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి.

స్నేహం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించడం గమనార్హం.

మంత్రి పొంగులేటికీ, హీరో వెంకటేశ్‌కూ ఉన్న లింక్ ఇదే?