సింగర్ కేకే తెలుగులో పాడిన సూపర్ హిట్ పాటలు ఏంటో మీకు తెలుసా?
TeluguStop.com
దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ సింగర్లలో కేకే ఒకరు.కేకే పూర్తి పేరు కృష్ణకుమార్ కన్నత్ కాగా ఆయన మరణవార్త తెలిసి ఆయన ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు.
న్యూఢిల్లీలో జన్మించిన కేకే సంగీతంపై ఉండే ఇష్టం వల్ల ముంబైకు షిఫ్ట్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన జల్సా సినిమాలోని మై హార్ట్ ఈజ్ బీటింగ్ సాంగ్ ను కేకే పాడారు.
ఆర్య సినిమాలోని ఫీల్ మై లవ్ పాటను, నా ఆటోగ్రాఫ్ సినిమాలోని గుర్తుకొస్తున్నాయి పాటను పాడిన సింగర్ కూడా కేకే కావడం గమనార్హం.
తెలుగులో ప్రేమదేశం సినిమాతో ప్లే బ్యాక్ సింగర్ గా కృష్ణకుమార్ కెరీర్ మొదలైంది.
నువ్వే నువ్వే సినిమాలోని ఐ యామ్ వెరీ సారీ, ఇంద్ర సినిమాలోని దాయి దాయి దామ్మా, ఖుషీ సినిమాలోని ఏమే రాజ హ, ఘర్షణ మూవీలో చెలియ చెలియ సాంగ్స్ ను కేకే పాడారు.
సంతోషం, సైనికుడు మరికొన్ని సినిమాలలో కేకే పాటలు పాడారు.నువ్వు నేను సినిమాలోని నీకోసమే నా అన్వేషణ, వాసు సినిమాలోని పాటకు ప్రాణం పాటలు కేకేకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
"""/" /
ప్రేమ కావాలి సినిమాలోని మనసంతా ముక్కలు చేసి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో టైటిల్ సాంగ్ ను కేకే పాడారు.
కేకే పాటలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు కేకే మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.
బాలీవుడ్ లో మాఛిస్ మూవీలోని ఛోడ్ ఆయే హమ్ సాంగ్ తో కేకే కెరీర్ మొదలుకాగా తడప్ తడప్ సినిమాతో మంచి గుర్తింపు దక్కింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో కేకే 500కు పైగా పాటలు పాడగా ఇతర భాషల్లో 200కు పైగా పాటలు పాడారు.
1991లో జ్యోతికృష్ణ అనే యువతితో కేకేకు వివాహం జరగగా ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి21, మంగళవారం 2025