ఏఎన్నార్ దాన వీర శూర కర్ణ సినిమాలో నటించకపోవడానికి అసలు కారణమిదే?

పౌరాణిక సినిమాగా తెరకెక్కి తెలుగులో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న సినిమాగా దానవీర శూరకర్ణ సినిమాకు పేరుంది.

1977 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచింది.

కేవలం 10 లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే కోటి రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.

1994 సంవత్సరంలో ఈ సినిమా రెండోసారి విడుదలైంది.రెండోసారి రిలీజైన సమయంలో కూడా ఈ సినిమా కోటి రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.

సీనియర్ ఎన్టీఆర్ శ్రమ ఫలితం వల్ల ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను అందుకుంది.

4 గంటల 17 నిమిషాల నిడివితో రిలీజైన ఈ సినిమాలో అర్జునుని పాత్రలో నందమూరి హరికృష్ణ నటించగా అభిమన్యుని పాత్రలో బాలకృష్ణ నటించారు.

ఈ సినిమా సీనియర్ ఎన్టీఆర్ నటించిన 248వ సినిమా కావడం గమనార్హం.ఈ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ, హరికృష్ణలకు సీనియర్ ఎన్టీఆర్ మేకప్ వేయడం గమనార్హం.

"""/"/ సీనియర్ ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించారు.

ఈ మూవీలో శ్రీ కృష్ణుడు లేదా కర్ణుడు పాత్రలో నటించాలని సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్నార్ ను కోరారు.

శ్రీకృష్ణుడి పాత్ర తాను చేయనని ఎన్టీఆర్ ను చూసిన కళ్లు ఆ పాత్రలో తనను చూడలేవని ఏఎన్నార్ సీనియర్ ఎన్టీఆర్ తో చెప్పారు.

"""/"/ తాను కర్ణుడి పాత్రలో నటిస్తే పాండవులు కూడా మరుగుజ్జులలా కనిపిస్తారని అందువల్ల ఆ పాత్రలో కూడా తాను నటించలేనని ఏఎన్నార్ వెల్లడించారు.

అప్పటి సీఎం జలగం వెంగళరావు ఎన్టీఆర్ కోరిక మేరకు ఏఎన్నార్ ను ఆ సినిమాలో నటించాలని కోరారు.

అయితే ఏఎన్నార్ మాత్రం తాను ఆ పాత్రలలో నటించలేనని సున్నితంగా తిరస్కరించారు.

సుజీత్ నాని తో చేయబోయే సినిమా ఆ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ చేశారా..?