టాలీవుడ్ కు డీటీఎస్ టెక్నాలజీని చిరంజీవే పరిచయం చేశారా.. ఏ మూవీతో అంటే?
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఆచార్య సినిమా ప్రేక్షకులను నిరాశపరిచిన విషయం తెలిసిందే.
ఆచార్య సినిమా ఫస్ట్ వీక్ లో 46 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే.
ఆచార్య సెకండ్ వీక్ కలెక్షన్లు దారుణంగా ఉన్నాయని తెలుస్తోంది.అయితే టాలీవుడ్ కు డీటీఎస్ టెక్నాలజీని పరిచయం చేసిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కావడం గమనార్హం.
ప్రస్తుతం ప్రతి సినిమాకు డీటీఎస్ ఎంతో ముఖ్యం కాగా చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాతో తెలుగులో ఈ టెక్నాలజీ పరిచయమైంది.
1997 సంవత్సరం అక్టోబర్ నెల 2వ తేదీన ఈ సినిమా విడుదలైంది.200 థియేటర్లలో 121 ప్రింట్లతో ఈ సినిమా రిలీజ్ కావడం గమనార్హం.
మొదట ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించడం గమనార్హం.
రెండు వారాల్లోనే ఈ సినిమాకు ఏకంగా ఐదున్నర కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.
ఆ తర్వాత కలెక్షన్లు మరింత పెరిగి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాకు దర్శకుడు సురేష్ కృష్ణ కాగా సురేష్ కృష్ణ కోరిక మేరకు ఈ సినిమాలో చిరంజీవి ఒక పాట పాడారు.
తమ్ముడు అరె తమ్ముడు లిరిక్స్ తో చిరంజీవి పాడిన పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ పాటకు లారెన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.ఈ పాట ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది.
"""/"/
ఈ సినిమాలో చిరంజీవి తెలుగు లెక్చరర్ రోల్ లో స్టైలిష్ గా కనిపించారు.
విద్యార్థులను సరైన మార్గంలో నడిపించే గురువు పాత్రకు చిరంజీవి పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.
మాస్టర్ సినిమాకు ముందు సీనియర్ డైరెక్టర్లకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చిన చిరంజీవి ఈ సినిమా నుంచి రూటు మార్చి యంగ్ డైరెక్టర్లకు అవకాశాలను ఇస్తూ వచ్చారు.
అక్రమ వలసదారుల ఏరివేత .. యాక్షన్‌లోకి ట్రంప్, గురుద్వారాలలో యూఎస్ ఏజెంట్ల తనిఖీలు