బ్లడ్ క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు
TeluguStop.com
క్యాన్సర్ .ఈ పేరు వినగానే సగం ప్రాణం పోయినంత పనవుతుంది.
క్యాన్సర్ లో చాలారకాలు ఉన్నాయి.బ్లడ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, బ్రీస్ట్ క్యాన్సర్, స్కీన్ క్యాన్సర్, ప్రొటెస్ట్ క్యాన్సర్ .
ఇలా రకరకాల క్యాన్సర్ మనిషి ప్రాణానికి ప్రమాదమై కూర్చుంటున్నాయి.ప్రతీ ఏటా వేలల్లో, లక్షల్లో మనుషులు క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు.
ఇక బ్లడ్ క్యాన్సర్ తెచ్చే ముప్పు అంతాఇంతా కాదు.ఈ బ్లడ్ క్యాన్సర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* బ్లడ్ క్యాన్సర్ రక్తకణాలను దెబ్బతీస్తుంది.దీని ప్రభావం ఎక్కువగా బోన్ మ్యారోలో, తెల్లరక్తకణాలపై ఉంటుంది.
* బ్లడ్ క్యాన్సర్ లో లుకేమియా, లింఫోమా, మైలోమా అనే రకాలు ఉంటాయి.
* లుకేమియా రక్తంలో, బోన్ మ్యారో లో కనిపిస్తుంది.* లింఫోమా క్యాన్సర్ లింఫాటిక్ సిస్టమ్ ను దెబ్బతీస్తుంది.
* మైలోమా ప్లాస్మా సెల్స్ మీద చెడు ప్రభావం చూపుతుంది.* ఈ మూడు రకాల బ్లడ్ క్యాన్సర్స్ కి ట్రీట్మెంటు పద్ధతులు వేరుగా ఉంటాయి.
* చాలవరకు బ్లడ్ క్యాన్సర్ ని ముందే గుర్తించటం, వచ్చినవెంటనే గుర్తించటం కష్టం.
అందుకే దీని నుంచి బ్రతికి బయటపడ్డ వారికంటే చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువ.
* బ్లడ్ క్యాన్సర్ పిల్లలకి కూడా రావొచ్చు.* 14 ఏళ్ళ లోపే చనిపోతున్న పిల్లల్లో అత్యధిక శాతం బ్లడ్ క్యాన్సర్ బాధితులే.
* కెమికల్స్ వాడే పనిచేస్తున్న వారికి ఈ బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.
* స్మోకింగ్ అలవాటు ఉన్నవారు బ్లడ్ క్యాన్సర్ బారిన పడే అవకాశం చాలా ఎక్కువ.
* బ్లడ్ క్యాన్సర్ ఆడవారి కంటే మగవాళ్ళలోనే ఎక్కువ కనబడుతుంది.
ఈ ఏడాది పెద్ద విజయాలు సాధించిన చిన్న సినిమాలివే.. రికార్డులు క్రియేట్ అయ్యయిగా!