మొదటిసారి బిగ్ బాస్ లోకి సాధారణ రైతు… ఎవరూ ఈ పల్లవి ప్రశాంత్!

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్( Bigg Boss ) రియాలిటీ షో ఒకటి.

బిగ్ బాస్ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తుంది.

ఇక తెలుగులో ఇప్పటికే ఈ కార్యక్రమం ఆరు సీజన్లను పూర్తి చేసుకొని, తాజాగా ఆదివారం సాయంత్రం ఏడవ సీజన్ ఎంతో ఘనంగా ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే.

ఇలా నాగార్జున( Nagarjuna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఒక్కో కంటెస్టెంట్ ను హౌస్ లోపలికి పంపించారు.

"""/" / ఇకపోతే ఎప్పటిలాగే ఈ కార్యక్రమంలో కూడా కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా రైతు పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth )కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.

ఈయన ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం ఒక సాధారణ రైతుగా మొదటిసారి ఈ సీజన్లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు.

ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమంలో రైతుగా (Farmer) పాల్గొన్నటువంటి పల్లవి ప్రశాంత్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే ఈయన ఒక సాధారణ రైతు తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ ద్వారా అందరితో పంచుకునేవారు.

"""/" / ఈ విధంగా యూట్యూబ్ ఛానల్( YouTube Channel ) ద్వారా వ్యవసాయానికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ రోజురోజుకు ఎంతోమంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు.

అయితే ఈయన గత మూడు సీజన్లో నుంచి తనకు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆసక్తిగా ఉందని తనకు ఒక అవకాశం కల్పించాలి అంటూ పలు సందర్భాలలో వేడుకున్నారు.

అయితే ఈయనకు ఈ కార్యక్రమం పట్ల ఉన్నటువంటి ఆసక్తి తెలుసుకున్నటువంటి నిర్వాహకులు ఈయనని ఈసారి కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా హౌస్ లోకి తీసుకువచ్చారు.

ఇక హౌస్ లో ఉండే ఇతర సెలబ్రిటీల మాదిరి కాకుండా ఈయనకు చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తూ బిగ్ బాస్ లో పాల్గొనాలనే తన కోరికను ఇలా నెరవేర్చారని తెలుస్తుంది.

మరి కామన్ మాన్ గా వెళ్ళినటువంటి ప్రశాంత్ ఎలా తన ఆటతీరుతో అందరిని మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.

వివేక్ రామస్వామి పదవిపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన