మనోజ్ పెళ్లి చేసుకోబోతున్న భూమా మౌనిక గురించి ఈ విషయాలు తెలుసా?
TeluguStop.com
మంచు మోహన్ బాబు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మనోజ్ తక్కువ సినిమాల్లోనే నటించినా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి.
మంచు మనోజ్ వివాదాలకు దూరంగా ఉండటంతో పాటు కొన్ని విషయాలలో అభిమానులకు స్పూర్తిగా నిలుస్తారు.
నిజ జీవితంలో కూడా మంచు మనోజ్ సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారు.అయితే మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి గతంలో పలు వార్తలు వైరల్ అయినా ఆ వార్తలను మనోజ్ ఖండించారు.
అయితే తాజాగా మనోజ్ భూమా మౌనికతో పెళ్లి గురించి స్పందిస్తూ అది తన వ్యక్తిగత విషయమని సందర్భం వస్తే తప్పకుండా చెబుతానని అన్నారు.
అయితే ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం మనోజ్, మౌనికల పెళ్లి జరగడం ఖాయమేనని తెలుస్తోంది.
భూమా మౌనిక దివంగత రాజకీయ నేత భూమా నాగిరెడ్డి దంపతుల రెండో కూతురు కావడం గమనార్హం.
భూమా మౌనిక గతంలోనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ వ్యక్తితో మనస్పర్ధలు రావడం వల్ల విడిపోయారు.
భూమా మౌనికకు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. """/"/
ప్రస్తుతం మౌనిక హైదరాబాద్ లోనే ఉంటున్నారు.
భవిష్యత్తులో రాజకీయాలలో సక్సెస్ సాధించాలని ఆళ్లగడ్డ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆమె భావిస్తున్నారు.
అక్క అఖిలప్రియతో ఆస్తి వివాదాలు ఉండగా ఆ సమస్యలను కూడా పరిష్కరించుకోవాలని భూమా మౌనిక భావిస్తున్నారు.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా మౌనికకు ప్రజల్లో మంచి పేరు ఉండటం గమనార్హం. """/"/
మౌనికా రెడ్డి మంచి మాటకారి కావడంతో పాటు మృదు స్వభావి కావడం గమనార్హం.
మనోజ్ మౌనిక జోడీ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.మనోజ్ మౌనిక పెళ్లి చేసుకుంటే మనోజ్ ఫ్యాన్స్ సంతోషిస్తారు.
అయితే మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం మనోజ్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
అల్లు అర్జున్ భార్య ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. వామ్మో అంత సంపదించారా?