బాలయ్య నటించిన ఒక్క మగాడు మూవీ ఫ్లాప్ కావడానికి కారణాలివే?

కొన్ని సినిమాలపై రిలీజ్ కు ముందే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడతాయి.అయితే ఆ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అవుతుంటాయి.

బాలకృష్ణ హీరోగా అనుష్క హీరోయిన్ గా వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లో తెరకెక్కి 2008 సంవత్సరంలో రిలీజైన ఒక్క మగాడు సినిమా భారీ అంచనాలతో రిలీజై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

కథ, కథనంలోని లోపాలు ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కారణమయ్యాయి.ఈ సినిమా కథ, కథనం భారతీయుడు సినిమాను పోలి ఉందనే కామెంట్లు సైతం వినిపించాయి.

లక్ష్మీ నరసింహ సినిమా తర్వాత సరైన హిట్ లేని బాలకృష్ణకు ఈ సినిమాతో మరో ఫ్లాప్ ఖాతాలో చేరింది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు భారీ మొత్తంలో నష్టాలను మిగల్చడం గమనార్హం.

దేవదాసు సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా మరో సక్సెస్ ను అందుకున్న వైవీఎస్ చౌదరి బాలయ్యతో సినిమాను తీయాలనే కోరికను ఒక్క మగాడు సినిమాతో నెరవేర్చుకున్నారు.

"""/" / ఈ సినిమాలో నిషా కొఠారి, సిమ్రాన్ కీలక పాత్రల్లో నటించారు.

మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

2008 సంవత్సరం జనవరి 10వ తేదీన ఒక్క మగాడు మూవీ రిలీజ్ కాగా ఈ సినిమాకు భారీస్థాయిలో ఓపెనింగ్స్ వచ్చినా ఆ స్థాయిలో కలెక్షన్లు మాత్రం రాలేదు.

ఈ సినిమాకు నిర్మాత కూడా వైవీఎస్ చౌదరి కాగా ఆయనకు కోట్ల రూపాయల నష్టం వచ్చింది.

ఒక్క మగాడు సినిమా ఫ్లాప్ గా నిలిచినా అదే సమయంలో వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కి విడుదలైన కృష్ణ సినిమా మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుని విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాకు భారీస్థాయిలో కలెక్షన్లు రావడంతో పాటు రవితేజ కెరీర్ లో హిట్ గా కృష్ణ నిలిచింది.

శ్రీకాళహస్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి , ఎంపీ అభ్యర్థి వరప్రసాద్