యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు సొంతమైన ఈ రికార్డ్స్ గురించి మీకు తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఈ పేరు కి పెద్ద పరిచయం అవసరం లేదు.

22 ఏళ్ల సినీ చరిత్రలో 27 సినిమాలు తీసి టాలీవుడ్ లో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా నిలిచారు ఎన్టీఆర్.

ఆర్ఆర్ఆర్ సినిమా( RRR ) విడుదల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ కు అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది.

దాదాపు రెండున్నర సంవత్సరాలు తర్వాత దేవర సినిమాలో( Devara ) కనిపించనున్నారు ఎన్టీఆర్.

ఈ సినిమాలో ఫియర్ సాంగ్ నిన్నే విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ని అందుకుంది.

ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు( NTR Birthday ) సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

"""/" / జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు తారక రామ్.ఒకరోజు హరికృష్ణ సీనియర్ ఎన్టీఆర్ దగ్గరికి తనయుడిని తీసుకెళ్లగా తానే స్వయంగా నందమూరి తారక రామారావుగా( Nandamuri Taraka Ramarao ) పేరుని మార్చారు.

చిన్నప్పుడే కూచిపూడి నేర్చుకున్న ఎన్టీఆర్ కు అది చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది.

ఇప్పుడు సినిమాలలో ఏ స్టెప్ అయినా అవనీలుగా వేయగలుగుతున్నారు ఎన్టీఆర్.ఎనిమిదేళ్ల వయసులోనే ముఖానికి మేకప్ వేసి భరతుడిగా సినీ ప్రయాణం మొదలుపెట్టారు తారక్.

తనకి ఇద్దరు మగ పిల్లల పుట్టడంతో ఆడపిల్లలేని లోటు ఎప్పుడూ ఉంటుంది అని మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో మహేష్ బాబుతో చెప్పారు.

"""/" / జపాన్లో అత్యధికమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న భారత హీరోలలో నందమూరి తారక రామారావు ఒకరు.

ఏ సినిమాలో అయినా హీరో డైలాగులు కోసం అందరూ ఎదురు చూస్తారు కానీ ఎన్టీఆర్ నటించిన నరసింహుడులో( Narasimhudu ) ఇంటర్వెల్ వరకు తారక్ కు ఒక డైలాగ్ కూడా లేకపోవడం విశేషం.

తారక్ నటించిన ఆంధ్రావాలా( Andhrawala ) సినిమా ఆడియో లాంచ్ కు పోలీసులు స్పెషల్ గా ట్రైన్లు కూడా ఏర్పాటు చేశారు.

అంత మంది జనాలని తట్టుకోలేక ఈవెంట్ ఆపేశారు.చిన్నవయసులోనే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోవడం తారక్ కు మాత్రమే సాధ్యం.

కాఫీలో వీటిని కలిపి తీసుకోండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి!