KTR : అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్, ఎమ్మెల్యే రాజగోపాల్ మధ్య ఆసక్తికర చర్చ

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్( MLA KTR ), కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ( MLA Rajagopal Reddy ) మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.

దానికి ఆయనకు సమాధానం ఇస్తూ మీలాగానే తమకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.

"""/" / అయితే ఫ్యామిలీ పాలన కాదు మంచిగా పని చేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయని తెలిపారు.

అలాగే ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా? సంకీర్త్ పోటీ చేస్తున్నారా? అని కేటీఆర్ అడిగారు.

దీనిపై లక్ష్మీ పోటీ చేస్తుందని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు.అలాగే తనను కాంట్రావర్సీ చేయొద్దని తెలిపారు.

దీంతో తరువాత మాట్లాడదాం అంటూ కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది.

బన్నీ అరెస్ట్ దేనికి సంకేతం.. సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండకపోతే చుక్కలే!