ప్రభాస్ ను విమర్శించారు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు.. మంచోళ్లను విమర్శిస్తే ఇదే పరిస్థితి!

డార్లింగ్ ప్రభాస్ ( Prabhas )గురించి మనందరికీ తెలిసిందే.ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.

ఇకపోతే ప్రభాస్ తాజాగా కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

కాగా ప్రభాస్ వివాదాలకు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారన్న విషయం మనందరికీ తెలిసిందే.తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటాడు.

అలాంటి ప్రభాస్ ని కొందరు విమర్శించారట.దానికి ఫలితంగా ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారట.

"""/" / ఇంతకీ వాళ్ళు ఎవరు అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.

ప్రభాస్ కెరీర్ అయిపోయింది అంటూ వేణు స్వామి కామెంట్స్ చేశాడు.కట్ చేస్తే ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేశాడు.

వేణు స్వామి మాత్రం తను చెప్పిన జాతకాలన్నీ తప్పయ్యి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు.

చివరికి జాతకాలు చెప్పడమే మానేస్తున్నట్లు ప్రకటించాడు.ఇక గత ఏడాది డిసెంబర్ లో ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.

ఇదే సమయంలో కన్నడ హీరో దర్శన్ నటించిన కాటేరా సినిమా( Kaatera ) కూడా విడుదల అయింది.

ఆ సమయంలో హీరో దర్శన్( Darshan ) అనవసరంగా ప్రభాస్ పై నోరు పారేసుకున్నాడు.

"""/" / సలార్( Salar ) సినిమాకు మేం భయపడడం మాకే సలార్ భయపడాలి అంటూ ప్రభాస్ ని తక్కువ చేసే విధంగా మాట్లాడాడు.

ఏ హీరో అయినా తమ సినిమాతో పాటు మిగతా సినిమాలు కూడా ఆడాలి అని కోరుకుంటారు.

కానీ దర్శన్ మాత్రం అవసరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.కట్ చేస్తే ఒక హత్య కేసులో జైలు పాలయ్యాడు.

ఇప్పుడు ప్రణీత్ హనుమంతు( Praneeth Hanumanthu ) అనే యూట్యూబర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

ఇతను ప్రభాస్ ని ఎన్నోసార్లు ట్రోల్ చేశాడు.అలాగే ఫన్ పేరుతో అందరి మీద హద్దుమీరి కామెంట్స్ చేస్తుంటాడు.

ఇటీవల ఒక చిన్నారిపై కూడా దారుణమైన కామెంట్స్ చేశాడు.అది నెటిజెన్ల ఆగ్రహం తెప్పించడమే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల వరకు చేరింది.

ఇప్పటికే అతనిపై కేసు నమోదైంది.ఈ మూడు సంఘటనలను ప్రభాస్ పేరుతో ముడిపెడుతూ కొందరు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.

సైలెంట్ గా ఉండే ప్రభాస్ పై విమర్శలు చేశారు.ఇప్పుడు పరిస్థితి ఏమైందో చూశారు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు డార్లింగ్ ఫాన్స్.

షాకింగ్ వీడియో: బల్లిని తరిమికొట్టాలని స్ప్రే తీసుకెళ్లిన అమ్మాయికి ఏకంగా..?