పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. !
TeluguStop.com
ఊసరవెల్లి గురించి అందరికి తెలిసిందే.ఇక ఇదే జాతికి చెందిన వారు రాజకీయ నాయకులని కొందరు అనడం పరిపాటే.
ఎవరు రాజకీయ నేతలను ఊసరవెల్లి తో పోల్చారో గానీ కొందరి ప్రవర్తన ఇలాగే ఉంటుందట.
పదవుల కోసం ఆశపడి గోడ మీది పిల్లిలాగా పార్టీలు మారడం చేస్తుంటారు.ఇక ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందట.
కాగా అనేక మంది నేతలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్‌ను వీడి బీజేపీలో చేరి సీఎం మమతా బెనర్జీ మనస్సును బాధపెట్టిన సంగతి తెలిసిందే.
అయితే వారందరికి జ్ఞానోదయం కలిగినట్లుగా ఉంది కావచ్చూ.నేడు హుగ్లీ జిల్లాలో దాదాపు 200 మంది కార్యకర్తలు తిరిగి తృణమూల్‌లో చేరారడం విశేషం.
అంతే కాదు తాము తప్పుచేశాం అని భావిస్తున్నామంటూ గుండ్లు గీయించుకొని శరీరంపై గంగా జలాన్ని చల్లుకున్నారట.
ఇదెక్కడి చోధ్యం.దేశమంతా మోడీ అంటూ జపిస్తున్నారని ప్రచారం అవుతుంటే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మాత్రం ఇది ఏం కొత్త వింత అని అంటున్నారట ప్రజలు.
సందీప్ కిషన్ మళ్ళీ కమర్షియల్ బాట పట్టాడా..?