నటుడు మన్నవ బాలయ్య గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
TeluguStop.com
ప్రముఖ టాలీవుడ్ నటుడు మన్నవ బాలయ్య ఈరోజు ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారనే సంగతి తెలిసిందే.
మన్నవ బాలయ్య చిన్న వయస్సులో నాటకాల్లోకి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నా కొన్ని కారణాల వల్ల ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు.
వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బాలయ్య ఇంజనీరింగ్ చదివారు.హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య ఆనాటి అగ్ర నటులతో కలిసి నటించారు.
1930 సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన గుంటూరు జిల్లాలోని చామపాడులో బాలయ్య జన్మించారు.
తండ్రి బాలయ్యతో వ్యవసాయం చేయించాలనుకున్నా టీచర్ సూచనల మేరకు పదో తరగతి పరీక్ష రాయించారు.
ఆ తర్వాత తండ్రిని ఒప్పించి మద్రాస్ లో బాలయ్య ఇంటర్ లో చేరారు.
అక్కడ ఇంగ్లీష్ మీడియంలో చేరిన బాలయ్య మొదట ఫెయిలైనా తర్వాత ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు.
ఆ తర్వాత ఇంజనీరింగ్ లో చేరిన బాలయ్య ఒకవైపు చదువుకుంటూ మరోవైపు నాటకాల్లో పాల్గొన్నారు.
అయితే కాలేజ్ లో తాను వేసిన నాటకం సరిగ్గా రాలేదని భావించిన బాలయ్య ఆ తర్వాత నాటకాలకు దూరంగా ఉండాలని అనుకున్నారు.
బీటెక్ పూర్తైన తర్వాత బాలయ్య కొంతకాలం పాటు లెక్చరర్ గా పని చేశారు.
ఆ తర్వాత ఒక సంస్థలో జాబ్ లో చేరారు.ఆ తర్వాత సారథి ఫిలిమ్స్ బ్యానర్ లో ఎత్తుకు పైఎత్తు అనే సినిమా ద్వారా బాలయ్య నటుడిగా ఎంట్రీ ఇచ్చారు.
విఠలాచార్య బాలయ్యకు ఒక మూవీలో ఛాన్స్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. """/"/
విఠలాచార్య అలా చేయడంతో హర్ట్ అయిన బాలయ్య సొంతంగా సినిమాలను నిర్మించాలని అమృతా ఫిలిమ్స్ ను స్థాపించారు.
ఈ బ్యానర్ లో వచ్చిన చెల్లెలు కాపురం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
మన్నవ బాలయ్య పుట్టినరోజు నాడే మరణించడం గమనార్హం.
ఏఐ వాడి సమంతను టార్గెట్ చేశారుగా.. అలాంటి వీడియో నెట్టింట వైరల్!