24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఈ నెల 24 వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ దాకా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ మేరకు ఆయా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.h3 Class=subheader-styleఫస్ట్ ఇయర్ వారికి ఉదయం.

/h3p జిల్లా లోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన  విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు.

ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 24 వ తేదీ నుంచి వచ్చే నెల (జూన్ 1 వ తేదీ) దాకా నిర్వహించనున్నారు.

ఫస్ట్ ఇయర్ వారికి పరీక్షలు ఉదయం 9 గంటలకు మొదలై పగలు 12 గంటల దాకా, సెకండ్ ఇయర్ వారికి 2.

30 గంటలకు మొదలై 5.30 గంటల దాకా చేపట్టనున్నారు.

జిల్లాలో మొత్తం 14 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 2222 మంది, సెకండ్ ఇయర్ పరీక్షలకు 1412 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

గవర్నమెంట్ జూనియర్ కాలేజీ బాయ్స్ సిరిసిల్ల, సెస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గర్ల్స్ సిరిసిల్ల, టీఎస్ డబ్ల్యూర్ఎస్ జూనియర్ కాలేజీ(బాలికల) బద్దెనపల్లి, సాయి శ్రీ జూనియర్ కాలేజీ అనంతనగర్ సిరిసిల్ల, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కోనరావుపేట,గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఇల్లంతకుంట, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ వేములవాడ, వివేకానంద జూనియర్ కాలేజీ సాయి నగర్ వేములవాడ, సుమిత్ర శ్రీ ఒకేషనల్ జూనియర్ కాలేజీ వేములవాడ,గవర్నమెంట్ జూనియర్ కాలేజీ చందుర్తి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గంభీరావుపేట్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ముస్తాబాద్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎల్లారెడ్డిపేట్, రాచర్ల జూనియర్ కాలేజీ గొల్లపల్లిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

H3 Class=subheader-styleపర్యవేక్షణకు బృందాలు./h3p పరీక్షల పర్యవేక్షణకు వివిధ శాఖల అధికారులతో బృందాలు ఏర్పాటు చేశారు.

  డీఈసీలు ఇద్దరు, చీఫ్ సూపరింటెండెంట్లు 14, డిపార్ట్ మెంటల్ అధికారులు 14, అదనపు చీఫ్ సూపరింటెండెంట్లు 4, సిట్టింగ్ స్క్వాడ్ ఇద్దరు, ఫ్లయింగ్ స్క్వాడ్ ముగ్గురు, కస్టోడియన్స్ ఇద్దరిని నియమించామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మోహన్ తెలిపారు.

మొటిమలు వాటి తాలూకు గుర్తులతో ఇక నో వర్రీ.. ఇంట్లోనే ఈజీగా వదిలించుకోండిలా!